17 లక్షల మంది విద్యార్థులకు నష్టం: కేటీఆర్‌

హైదరాబాద్‌: ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథక నిర్వహణపై సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ప్రభుత్వంపై  మండిపడ్డారు. ఓట్లకోసం ఆర్భాటంగా ప్రారంభించిన ప్రారంభించిన ఈ పథకాన్ని  ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శించారు. ఫీజుల చెల్లింపులపై స్పష్టత ఇవ్వకుండా ఎలాంటి కౌన్సెలింగ్‌లను నిర్వహించొద్దని సూచించారు. ప్రభుత్వ తీరుతో 17 లక్షల మంది విద్యార్థులు  నష్టపోతున్నారని అన్నారు. ఫీజుల చెల్లింపులపై ప్రభుత్వం తీరుకు నిరసనగా తెలంగాణలో అన్ని నియోజకవర్గాలో 8వ తేదీన నిరసనలు, 10న జిల్లా కెలెక్టరేట్‌ల ఎదుట ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.