18వరోజుకు చేరినవీఆర్ఏల సమ్మె

అర్థనగ్న ప్రదర్శన చేసిన వీఆర్ఏలు
మల్దకల్ ఆగస్టు 11 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు  గురువారంతహశీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు అర్ధనగ్న ప్రదర్శన సమ్మె కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా యూనియన్ మండల అధ్యక్షుడు లక్ష్మన్న మాట్లాడుతూ తమ డిమాండ్ లను అమలు చేసే వరకూ సమ్మె కొనసాగిస్తామనిఆయన అన్నారు,అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలి,వి ఆర్ ఏ లకు వెంటనే పే స్కేలు ఇవ్వాలి,వీఆర్ఏ మండల అధ్యక్షుడు పుర్ర లక్ష్మన్న ఉపాధ్యక్షుడు నరింహులు,కార్యదర్శి వెంకటేష్, వెంకట్ రాములు, తిరుమల గౌడ్, గోవిందమ్మ ,తిమ్మమ్మ ,నర్సన్న, రాముడు,నామాల వినోద్, ఆయా గ్రామాల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా  వీఆర్ఏ జేఏసీ కన్వీనర్ కురువ గోవిందు, జనరల్ సెక్రెటరీ లక్ష్మన్న, కో కన్వీనర్ నరసింహులు సందర్శించి సంఘీభావం తెలిపారు.