18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ పకడ్భందిగా రుపొందించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒటరు ధృవీకరణ , ఒటరు జాబితా తయారీ , గరుడ యాప్ వంటి పలు అంశాల పై ఆయన మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ గతంలో ఓటర్ల నమోదుకు జనవరి 1 తేదీ మాత్రమే ప్రమాణికంగా తీసుకొనే వారని, ఈ సంవత్సరం నుంచి జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను సైతం ప్రామాణికంగా తీసుకుంటూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు.
జిల్లాలో ఓటరు జాబితా నమోదు ప్రక్రియ పై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించారు.
ఆగస్టు 4 నుంచి అక్టోబర్ 24, 2022 వరకు ప్రీ రివిజన్ నిర్వహించి నవంబర్ 9, 2022 న ముసాయదా ఒటరు జాబితా విడుదల చేయాలని, డిసెంబర్ 8, 2022 వరకు సదరు జాబితా పై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వికరించాలని, రెండు శనివారాలు, ఆదివారాలు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని డిసెంబర్ 26,2022లోగా అభ్యంతరాలను ,ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి 5, 2023 న తుది ఓటరు జాబితా రుపోందించాలని తెలిపారు. ఒటరు నమోదు కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారిగా ప్రత్యేక కార్యక్రమాలు రుపొందించి అమలు చేయాలని సూచించారు. ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా స్వీప్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని , స్విప్ కార్యక్రమాల నిర్వహణ పట్ల జిల్లా స్థాయిలో సమావెశాలు నిర్వహించాలని ఆయన సూచించారు.
ఎన్నికల కమిషన్ ఫారం 6, ఫారం 7, ఫారం 6బీ, ఫారం 8 నూతనంగా ప్రారంభించిందని, ఫారం 8ఏ రద్దు చేసిందని, ఫారం 6 లో నూతన ఓటర్ నమోదు మాత్రమే ఉంటుందని, ప్రతి బూత్ స్థాయి అధికారి వద్ద నూతన ఫారంలు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఆగస్టు 1, 2022 నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వద్ద నుంచి ఆధార్ వివరాలు సేకరించాలని, ఆధార్ వివరాలు అందించడం ఐచ్చికం మాత్రమేనని, ఓటర్ల ఆధార వివరాలు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు
జిల్లా కలెక్టర్ జి.రవి, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, జగిత్యాల ఆర్.డి.ఓ. మాధురి సంబంధిత అధికారులు, తదితరులు ఈ వీడియో కాన్పరెన్సులో పాల్గోన్నారు.




