
గద్వాల నడిగడ్డ, జూన్ 26 (జనం సాక్షి);
జిల్లాలో ఎన్నికల ప్రాసెస్సింగ్ ఫార్మ్స్ , కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను బిఎల్వోలు ఇంటింటి సర్వే పూర్తి చేసి ఓటరు జాబితా సిద్దం చేయాలనీ, 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఎన్నికల అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా ఐడిఓసి కాన్ఫరెన్సు సమావేశ హాలు నందు స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమంలో ఓటర్ జాబితా, ఇంటింటి సర్వే తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరిని ఫారం_6 ద్వారా నమోదు చేయాలన్నారు. ఎవరైనా ఓటరు మరణిస్తే అట్టి వ్యక్తికి సంబంధించిన మరణ దృవీకరణ సర్టిఫికెట్ ఆధారంగా పేర్లను జాబితా నుండి తొలగించాలన్నారు. ఇంటిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఇంకా ఓటరుగా నమోదు చేసుకొని వారు ఉంటే వెంటనే వారిని ఓటర్ గా నమోదు చేయాలన్నారు. ఇంటింటి సర్వే పూర్తి చేసి జాబితా నుండి తొలగించిన వారి లిస్టు ను వెరిఫై చేయాలనీ, పోలింగ్ స్టేషన్ ల వారిగా 2 శాతం కంటే ఎక్కువ డిలిట్ అయిన వారి జాబితా ఇ ఆర్ ఓ లు పర్సనల్గా చెక్ చేయాలనీ తహసిల్దర్లకు అదేహించారు. జూలై 13 నాటికీ ఇంటింటి సర్వే పూర్తి చేసి అట్టి జాబితా ఇవ్వాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో డూప్లికేట్ ఓటరు ఉండడానికి వీలు లేదని, బి ఎల్ ఓ పరిదిలో ఉన్న ఓటర్ల అందరికి నో డూప్లికేట్ సర్టిఫికేట్ ఇవ్వాలని, ఏ పోలింగ్ స్టేషన్లో అయినా డబల్ ఓటరుగా నమోదు ఉండకూడదని తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ,జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్, అందరి ఓటరు లిస్టు చెక్ చేసుకోవాలని, వికలాంగులకు వారి సదరం సర్టిఫికెట్ ఆధారంగా ఓటరుగా నమోదు చేయాలన్నారు. హౌస్ సైట్స్ అంతిమ జాబితాను పరిశీలించి అందజేయాలన్నారు. హౌస్ సైట్స్ కు సంబంధించి ముందు ఉన్న వారి పట్టాల లిస్టు సిద్దం చేయాలన్నారు. జులై 1 న శనివారం గ్రూప్ 4 పరీక్షలు జరుగుతున్నందున పరీక్షా కేంద్రాలను తాసిల్దారులు ముందే పరిశీలించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరు లోపలికి రాకుండా బందోబస్తు తీసుకునేలా పోలీసు శాఖతో సమన్వయం చేసుకొని పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు ఆదేశించారు. ధరణి గురించి మాట్లాడుతూ తాసిల్దార్ కార్యాలయాలలోని ఫైల్స్ అన్ని కూడా ఈ ఆఫీసు ద్వారానే ఫైల్స్ సంబంధిత సెక్షన్ లకు పంపాలన్నారు.
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్, ఆర్డీవో రాములు, తాసిల్దారులు ,తదితరులు పాల్గొన్నారు.




