భారీ అగ్ని ప్రమాదంలో రూ. 18 కోట్ల ఆస్తి నష్టం

బీబీనగర్‌ : నల్గొండ జిల్లా బీబీనగర్‌ పట్టణంలో శ్రీయం ఆగ్రోకెమికల్‌ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ కంపెనీలో మిసైల్‌ ట్యాంకర్‌ను ఆన్‌లోడ్‌ చేస్తుండగా స్పార్క్‌ ఏర్పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో బీబీనగర్‌, చౌటుప్పల్‌ ప్రాంతాల నుంచి వచ్చిన నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 18కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనావేస్తున్నట్లు భువనగిరి ఆర్గీవో ఏవూరి భాస్కర్‌రావు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు సమాచారం. భువనగిరి రూరల్‌ సీఐ నరేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. బీబీనగర్‌ పట్టణానికి ఈ కంపెనీ చేరువలో ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.