హైదరాబాద్ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లాలో 19వ రోజు బంద్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 980 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో బస్టాండులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆందోళనకారులు డిపోల్లోకి వెళ్లకుండా పోలీసులు మోహరించారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయ. జూలై 31 నుంచి జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 19 రోజుల నుంచి వ్యాపార లావాదేవీలు లేకపోవడంతో వర్తకులు డీలాపడ్డారు.




