Sunday, 8 November 2026

July 2012

జిల్లా వార్తలు

టిడిపి ధర్నా, రాస్తారోకో

సంగారెడ్డి, జూలై 19 : విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మెదక్‌ పట్టణ టిడిపి ఆధ్వర్యంలో 20 మంది కార్యకర్తలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం నుంచి ర్యాలీగా రోడ్డు…

జిల్లా వార్తలు

నేడు వికలాంగుల గుర్తింపు శిబిరం

సంగారెడ్డి, జూలై 19 : సంగారెడ్డి రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి వికలాంగులలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు, పెద్దలు గుర్తింపు శిబిరం ఈ నెల 20వ తేదీన పాత డిఆర్‌డిఎ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు వికలాంగుల సంక్షేమ శాఖ పిడి…

వార్తలు

నల్లగొండ జిల్లాలో నిలిచిపోయిన రెండు రైళ్లు

నల్లగొండ : జిల్లాలోని భువనగిరి సమీపంలో అధిక లోడ్‌తో వెళ్తున్న గూడ్స రైలు నిలిచిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆలేరులో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, వంగపల్లి స్టేషన్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు…

వార్తలు

ప్రధానితో కేంద్ర మంత్రి పురందేశ్వరి భేటీ

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కేంద్ర మంత్రి పురంధేశ్వరి భేటీ అయ్యారు. విశాఖపట్టణం విమానాశ్రయాన్ని 24 గంటలు నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రధానికి ఆమె వినతిపత్రం సమర్పించారు. గుంటూరు మిర్చి కోల్డ్‌స్టోరేజి ప్రమాదంలో రైతులకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.

వార్తలు

పది డిమాండ్లపై ప్రతిష్టంభన: ఎన్‌ఎంయూ

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల పది డిమాండ్లపై ప్రతిష్టంభన కొనసాగుతుందని ఎన్‌ఎంయూ నేత మహమూద్‌ తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం, ఎన్‌ఎంయూ మధ్య నాలుగో దఫా చర్చలు ముగిశయి. చర్చలు ముగిసిన అనంతరం ఎన్‌ఎంయూ నేత మహమూద్‌ మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలోని…

వార్తలు

వుడా భూ కుంభకోణంలో ప్రాథమిక విచారణ: సీబీఐ జేడి

విశాఖపట్టణం: వుడా భూ కుంభకోణం కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోందని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ విశాఖ సీబీఐ కోర్టులో మౌళిక సదుపాయాలు, కేసులను సమీక్షించేందుకు ఇక్కడకు వచ్చానన్నారు.

వార్తలు

విజయనగరం జిల్లాలో విజిలెన్స్‌ దాడులు

విజయనగరం: గరుగుబిల్లి మండలంలో విజిలెన్స్‌ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో రూ.20లక్షల విలువైన 200బస్తాల నువ్వులు స్వాధీనం చేసుకున్నారు. 160జీడిపిక్కల బస్తాలు, 258ఎరువుల బస్తాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.

వార్తలు

బలంగా మారిన నైరుతి రుతుపవనాలు

విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో బలంగా మారాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45నుంచి 50కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. సముందంలోకి వెళ్లే మత్స్య కారులు అప్రమత్తంగా…

హైదరాబాద్

మరో ముగ్గురు అమర్‌నాథ్‌ యాత్రికుల మృతి

శ్రీనగర్‌: అమర్‌నాథ్‌ యాత్రలో మరో ముగ్గురు యాత్రికులు మరణించినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికుడొకరున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన అమర్‌నాథ్‌ యాత్రికుల సంఖ్య 88కి చేరుకుందన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన నవీన్‌…

హైదరాబాద్

కోలుకుంటున్న శతృఘ్నసిన్హా

ముంబాయి: ఇటీవలే బైపాస్‌ శస్త్రచికిత్స చేయించుకున్న నాటితరం బాలీవుడ్‌ నటుడు శతృఘ్న సిన్హాను గురువారం నాడు ఐసీయూ నుంచి గదికి తరలించారు. గురువారం ఉదయం ఆయనను గదికి తరలించారనీ, వైద్యుల సూచనల మేరకు మరికొద్ది రోజుల పాటు ఆయన…