Wednesday, 4 November 2026

July 2012

సీమాంధ్ర

కోళ్ళఫారంపై గ్రామస్తుల దాడి

విజయనగరం: .చీపురుపల్లీమండలంలోని కర్లాం గ్రామంలో దుర్వాసన వస్తుందంటు గ్రామస్తులు కోళ్ళఫారం పై దాడి చేశారు. ఈ దాడిలో భారీగా ఆస్తినష్టం సంభవించింది 7లక్షలకు పైగా కోళ్ళు చనిపోయాయి. కోళ్ళఫారంకి విద్యుత్‌ సరాఫరా నిలిపివేశారు.

హైదరాబాద్

మరిన్ని సంక్షేమ కార్యక్రమాల అమలుకు రంగం సిద్దం

హైదరాబాద్‌:ప్రస్తుతం ఉన్న సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాలకు మెరుగులు దిద్దుతూనే మరిన్ని కొత్త కార్యక్రమాలను తెచ్చేందుకు రంగం సిద్దమవుతోంది.మంత్రి ఆనం నివాసంలో సమావేశమైన మంత్రుల కమిటీ ఈ విషయమై చర్చించింది.ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాల్లో లోపాలను అధిగమించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్‌ పార్టీని గ్రామస్థాయినుంచి…

హైదరాబాద్

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ కోసం కోర్టులో వేసిన పిటిషన్‌ను ఈ రోజు హైకోర్టు కోట్టివేసింది. జగన్‌ ఒక పార్టీకి అధ్యక్షుడు, ఎంపీ అయినందువలన సాక్షులను ప్రభావితంచేసే ఆవకాశం ఉన్నందున బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేశారు.

హైదరాబాద్

ఆనం ఇంట్లో ముగిసిన మంత్రుల కమీటి

హైదరాబాద్‌: ఈ రోజు మంత్రుల కమీటి ఆర్థికమంత్రి ఆనం రాంనారయణ రెడ్డి నివాసంలో సమావేశామైన్నారు. ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కమీటి నిర్ణయించింది. మరోసారి మంత్రులందరితో సమావేశం నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ఈ…

వార్తలు

దైవకణం పరిశోధనలో కొత్త కణం గమనించాం:సెర్న్‌

జెనీవా:విశ్వసృష్టికి సంబందించిన దైవకణం పరిశోధనలో కొత్త కణాలను గమనించామని యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ న్యూక్లియర్‌ రీసెర్చ్‌-సెర్న్‌ ప్రకటించింది.2,100 మంది శాస్త్రవేత్తలతో పనిచేస్తున్న తమ బృందం కొత్త కణాన్ని కనిపెట్టిందని సీఎంఎస్‌ అనే బృందానికి నాయకుడిగా వ్యవహరించిన జో ఇన్‌కాండెలా…

నల్లగొండ

భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం

నల్గొండ:  కేతేపల్లి  మండలం భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. భీమవరం వద్ద మూసి వంతెనపై నుంచి ఆర్టీసీ బస్సు బోల్తా పడి 20 మందికి గాయాలు అయ్యాయి.

వార్తలు

శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఖరారు

ముంబయి:శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఖరారయింది.సచిన్‌కు విశ్రాంతినిచ్చి సెహ్వగ్‌,జహీర్‌లకు జట్టులో అవకాశం కల్పించారు.రవీంద్ర జడుజా,యూసుఫ్‌ పఠన్‌లకు మెండి చేయి చూపారు.అలాగే జట్టునుంచి ఇర్పాన్‌ పఠాన్‌,ప్రవీణ్‌కుమార్‌లకు ఉద్వాసన పలికారు.మనోజ్‌తివారి,రాహుల్‌ శర్మలు జట్టులో తమ స్థానం నిలబెట్టుకున్నారు.భారత జట్టు సభ్యులు వీరే…ధోనీ,వీరేంద్ర…

నల్లగొండ

కోదాడలో టీఆర్‌ఎస్‌ మహధర్నా

నల్గొండ: కోదాడలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు డీఈ కార్యలయం ఎదుట టీఆర్‌ఎస్‌  మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో టీఆర్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ బండ నరేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ఎల్వీ నేత హరిష్‌రావులతో పాటు కార్యకర్తలు పాల్గున్నారు. కృష్ణా డెల్టాకు నీటి విడుదలను…

హైదరాబాద్

ముఖ్యమంత్రితో సమావేశమైన సీపీఎం నేతలు

హైదరాబాద్‌:ఎత్తిపోతల పధకాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను 16 గంటలపాటు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం నేతలు క్యాంపు కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు.ఒక్క కృష్ణ జిల్లాలో ఉన్న 115 లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీముల ద్వారా 92వేల ఎకరాల్లో…

హైదరాబాద్

సినిమాలపై వ్యాట్‌ తొలగింపునకు ముఖ్యమంత్రి సుముఖం

హైదరాబాద్‌: సినిమాలపై వ్యాట్‌ను తొలగించునకు సీఎం సానుకూలంగ స్పందిచారని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తెలిపింది. వ్యాట్‌ తొలగిస్తామని ముఖ్యమంత్రి హామి ఇచ్చారని, దేశంలో ఎక్కడ లేని విధంగ ఏడు సంవత్సరాలనుంచి వ్యాట్‌ కడుతున్నమని ఇప్పటికెే వినోదపు పన్ను…