Friday, 6 November 2026

July 2012

హైదరాబాద్

బీవీ మోహన్‌రిడిని పరామర్శించిన చంద్రబాబు

హైదరాబాద్‌: మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన నగరంలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. టీడీపీ  పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఆసుపత్రికి వెళ్లి మోహన్‌రెడ్డిని…

హైదరాబాద్

ప్రాజెక్టుల పూర్తి విషయంలో ప్రభుత్వం విఫలం: కడియం

హైదరాబాద్‌: ప్రాజెక్టుల పూర్తి విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ నేత కడియం శ్రీహరి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంకంటే ఆ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకోవడంపైనే ప్రభుత్వతాపత్రయం ఉందని ఆయన ఆరోపించారు.…

కరీంనగర్

సిరిసిల్లలో మహిళపై దాడిని ఖండిచిన:ఈటెల

కరీంనగర్‌:  సిరిసిల్లలో మహిళలపై సీమాంధ్ర గూండాల దాడిని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడిని తెలంగాణలోని మహిళలపై దాడిగా అభివర్ణించారు. తెలంగాణలో ఏ చిన్న  అలజడి జరిగిన వీడియోలను చూసి కేసులు పెడుతారు మరీ…

వార్తలు

మద్దికెరలో లారీ బోల్తా

కర్నూలు:  మద్దికెరలో మిని లారీలో గుంతపల్లీకి పెళ్ళీకి వెల్తుండగా టైరుపేలి  బోల్తా పడింది. 50మంది గాయా పడ్డారు. వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్

మంత్రి పార్థసారధికి రెండు నెలల జైలు శిక్ష

హైదరాబాద్‌: కేపీఆర్‌ టెలి ప్రోడక్ట్స్‌ కేసులో మంత్రి పార్థసారధికి ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు మంత్రికి రెండు నెలల సాధారణ జైలు శిక్ష విదించింది. మంత్రి ఫెరా ఉల్లంఘనకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో రూ.5లక్షల 15వేల…

హైదరాబాద్

ఆర్టీసీ ఆదాయం 12శాతం పెరిగింది. ఎ.కె.ఖాన్‌

హైదరాబాద్‌: ప్రైవేటు బస్సులపై ఆర్టీసీ దాడులు చేపట్టడం వల్లఆర్టీసీ ఆదాయం 12శాతం పెరిగిందని ఆర్టీసీ ఎండీ ఎ.కె. ఖాన్‌ తెలిపారు. ఈ ఏడాదిలో రెండు వేల కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు.

జిల్లా వార్తలు

లొంగిపోయిన మంత్రి కుమారుడు

వరంగల్‌: ఎస్‌ఐని దుర్భాష లాడిన కేసులో మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్‌ ఈ రోజు జిల్లా కోర్టులో లొంగిపోయాడు. అతనికి మంగళవారం హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి విదితమే.

ఖమ్మం

భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం

ఖమ్మం: గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద నది నీటిమట్టం 30.5 అడుగులకు  చేరింది. పైనుంచి వస్తున్న   వరద నీటితో గోదావరి నీటిమట్టం 40 అడుగులకు చేరవచ్చిన అధికారులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్

దక్షిణాఫ్రికాలో రోడ్డుప్రమాదం

హైదరాబాద్‌: దక్షిణాఫ్రికాలోని డర్బన్‌ ప్రాంతానికి విహార యాత్రకు వెళ్లిన సాయిరాంరెడ్డి అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. సాయిరాంరెడ్డి హైదరాబాద్‌ ఘట్‌కేసర్‌కు చెందిన ఇంజినీరీంగ్‌ విద్యార్థి.

హైదరాబాద్

విద్యుత్‌ చార్జీలు తగ్గించే వరకు ఉద్యమం ఆపేదిలేదు

హైదరాబాద్‌: విద్యుత్‌ చార్జీలు తగ్గించేంత వరకు ఉద్యమం అగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. పది వామపక్షలు చేపట్టిన చలో సచివాలయం ముట్టడి సంధర్భంగా అరెస్ట్‌ అయిన రాఘవులును అరెస్ట్‌ చేసి అబిడ్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.…