August 2012
కాసేపట్లో ముఖ్యమంత్రితో భేటీ కానున్న మంత్రివర్గ ఉపసంఘం
హైదరాబాద్: సచివాలయంలో ఈ రోజు మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమయి ఫీజు రీయింబర్స్మెంట్, ఇంజనీరింగ్ కౌన్సిల్ తదితర విషయాలపై చర్చించినారు. అయితే కాసేపట్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశం కానున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.
కోటి విలువ చేసే గంజాయి పట్టివేత
విశాఖపట్నం: రోజు రోజుకు దేశవ్యాప్తంగా గంజాయి డ్రగ్స్‌కి ఎందరో యువకులు బానిసలయి ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఈ రోజు విశాఖపట్నంలోని జీకే విధిలో పోలీసులు సుమారు కోటికి పైగా విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధినం చేసుకున్నారు.
నేడు సోనియాను కలవనున్న ఈశాన్యరాష్ట్రాల లోక్‌సభ సభ్యులు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈశాన్య రాష్ట్రల్లో అభద్రతభావం పెరుగిపోతున్న సంధర్భంలో ఈశాన్య రాష్ట్రల్లోని ఎంపీలతో యుపీఏ చైర్పర్సన్ సోనియా గాంధిని కలసి వారి మనోభావాలను ఈ రోజు వివరించనున్నారు. వదంతులను నమ్మవద్దని అస్సోం సీఎంతో పాటు కేంద్ర హోంమంత్రి ప్రకటనలు…
ఈ నెల 21న రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నీక
ఢిల్లీ: రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి ఈ నెల 21న ఎన్నిక జరగనుంది నామినేషన్ గడువు రేపటితో ముగియనుంది. ఉప రాష్ట్రపతిగా నూతనంగా తిరిగి హామీద్అన్సారి ఎన్నికైన విషయం విధితమే.
ఎరువుల కోసం బారులు తీరిన రైతులు
వరంగల్: జిల్లాలోని గూడురులో రైతులు ఎరువుల కోసం బారులో తీరారు. అక్కడ రైతుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారిని వారించారు. భారీ బందోబస్తు మధ్య ఎరువుల పంపిణీ అధికారులు చేస్తున్నారు.
90 పడకల్లో 206 మంది చిన్నారులకు చికిత్స: అరుణ
తిరుపతి: తిరుపతిలోని రుయా చిన్నపల్లల ఆస్పత్రిలె 90 పడకల్లో 206 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి గల్లా అరుణ తెలియజేశారు. ఈ ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉందని, మౌలిక సదుపాయాలు సరిగా ఆమె చెప్పారు. ఆస్పత్రిలో సమస్యలను వెంటనే…
లంచం తీసుకుంటూ ఏసీబీకి వలలో చిక్కిన అగ్ని మాపక అధికారి
పశ్చిమగోదావరి: జిల్లాలోని అగ్నిమాపక అధికారి చంద్రశేఖర్ ఓ పాఠశాలకు అనుమతి ఇవ్వటానికి రూపాయాలు 7500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
సీపీఐ ఆధ్వర్యంలో 25న తెలంగాణ పోరు యాత్ర
హైదరాబాద్: సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 25న తెలంగాణ పోరు యాత్ర నిర్వహించాలని ఆ పార్టి నిర్ణయించింది. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయం మగ్థూం భవన్లో ఇవాళ తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు, సీపీఐ నేతలు సమావేశమై చర్చించారు.…
డయేరియాతో మహిళ మృతి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఖాసీపేట మండలం కోలంగూడలో డయేరియా ప్రబలి మహిళ మృతి చెందింది. గ్రామంలో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్య సిబ్బంది పట్టించుకోక పోవడంతోనే మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు గిరిజన సంఘాలు ఆరోపించాయి.

