Friday, 6 November 2026

August 2012

హైదరాబాద్

సత్యం ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీబీఐకి అనుమతి

హైదరాబాద్‌: సత్యం రామలింగరాజు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సిటీ సివిల్‌ కోర్టు అనుమతి ఇచ్చింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో సత్యం రామలింగరాజుకు చెందిన 29 చోట్ల ఉన్న 120 కోట్ల ఆస్తులను ఆటాచ్‌మెంట్‌ చేయడానికి సీబీఐకి అనుమతి ఇచ్చింది.

ఆదిలాబాద్

నిర్మలలో వైకాపా ఆధ్వర్యంలో రాస్తా రోకో

నిర్మల్‌ : పెంచిన ఫీజులు తగ్గించాలని కోరుతూ వైకాపా ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. పెంచిన ఫీజుల వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువలుకు దూరమవుతారని వారు పేర్కోన్నారు.

వార్తలు

అసోం అల్లర్లు ఆరికట్టడంలో ప్రభుత్వం విఫలం

న్యూఢిల్లీ: అసోం అల్లర్లపై లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షం భాజపా ప్రభుత్వంపై దాడికి దిగింది. ఈ అంశంపై లోక్‌సభలో భాజపా నేత అద్వానీ మాట్లాడుతూ అసోం అల్లర్లు మత  ఘర్షణలు కావని పేర్కొన్నారుజ అల్లర్లు అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని…

జిల్లా వార్తలు

తీవ్ర కడుపు నొప్పితో లారీ డ్రైవర్‌ మృతి

కొండపాక : తీవ్ర కడుపు నొప్పితో ఓ లారీడ్రై మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లా కొండపాక మండలం దుద్దెడ జాతీయ రహదారి పై విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద చోటు చేసుకుంది. లారీ నడుపుతున్న సమయంలో కడుపు నొప్పితో…

ఖమ్మం

సింగరేణి భూగర్భగనుల్లోకి వెళ్లిన సీఎం

ఖమ్మం: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మణుగూరు చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సులో బయలుదేరి ప్రకాశం భూగర్భగనిని సందర్శించారు. అక్కడ కార్మికుల దుస్తులు ధరించి భూగర్భగనిలోకి వెళ్లారు. 600 మీటర్ల…

వార్తలు

పాక్‌ ప్రధానికి సుప్రీం కోర్టు సమన్లు

ఇస్లామాబాద్‌: పాక్‌ ప్రధాని పర్వేజ్‌ అష్రాఫ్‌ ఈ నెల 27న తమ ఎదుట హాజరు కావాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. పాకిస్థాన్‌ అధ్యక్షుడు జర్దారీ అవినీతి కేసులపై పునర్విచారణ చేపట్టటంలో విఫలమైనందుకు ప్రధాని తమ ముందు హాజరు …

జిల్లా వార్తలు

సారయ్య ఇంటికి ముట్టడించిన టీఆర్‌ఎస్‌వీ

వరంగల్‌: ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా వరంగల్‌లో మంత్రి సారయ్య ఇంటిని టీఆర్‌ఎస్‌వీ విద్యార్థి సంఘం ముట్టడించింది. అర్హలందరికీ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

గజ్వేల్‌: మండలంలోని ప్రజ్ఞాపూర్‌ వద్ద రాజీవ్‌ రహదారి పై లారీని ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో వరంగల్‌ జిల్లా చేర్యాల మండలం తాడూరుకు చెందిన బాలరాజు మృతి చెందాడు.

వార్తలు

ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు లోక్‌సభ అభినందనలు

ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాల ఈ రోజు ప్రారంభమైనవి అయితే ముందుగా ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు లోక్‌సభ అభినందనలు తెలిపింది.

వార్తలు

గ్యాస్‌ కేటాయింపులపై ప్రధానికి కాంగ్రెస్‌ ఎంపీల కృతజ్ఞతలు

ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన ప్రధానిని ఎంపీలు కలిసారు. మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాజెక్ట్‌కు తరలించిన గ్యాస్‌ను తిరిగి రాష్రానికి కేటాయించినందుకు ప్రధానికి వారు ధన్యవాదాలు తెలిపారు.