అసోం అల్లర్లు ఆరికట్టడంలో ప్రభుత్వం విఫలం
న్యూఢిల్లీ: అసోం అల్లర్లపై లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షం భాజపా ప్రభుత్వంపై దాడికి దిగింది. ఈ అంశంపై లోక్‌సభలో భాజపా నేత అద్వానీ మాట్లాడుతూ అసోం అల్లర్లు మత ఘర్షణలు కావని పేర్కొన్నారుజ అల్లర్లు అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అక్రమ వలసలు ఆరికడితేనే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని సూచించారు. అద్వానీ ప్రసంగానికి పలువురు యూపీఏ సభ్యులు అడ్డుతగలడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.