Wednesday, 4 November 2026

August 2012

వార్తలు

మారుపేర్లతో డీఎస్సీ రాస్తున్న నలుగురి అరెస్టు

కాకినాడ నగరం: కాకినాడ జగన్నాధపురం సెయింట్‌ ఆన్స్‌ ఎయిడెడ్‌ స్కూల్‌లో మారుపేర్లతో డీఎస్సీ రాస్తున్న నలుగురు అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురేశ్‌రెడ్డి అనే అభ్యర్థికి సహకరించేందుకు నలుగురు యువకులు అదే పేరుతో దరఖాస్తు చేసుకోగా వారందరికి ఒకే…

జిల్లా వార్తలు

తెలంగాణ పోరుయాత్ర కోదాడకు చేరుకుంది

నల్గొండ: భారత కమూన్యినిస్టు పార్టీ చేపట్టిన తెలంగాణ పోరుయాత్ర జిల్లాలోని కొదాడకు చేరుకుంది. నేడు, రేపు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుంది.

హైదరాబాద్

ఉపముఖ్యమంత్రితో ఇంజినీరింగ్‌ కళాశాలల టాన్క్‌ఫోర్స్‌ భేటీ

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ ఉప ముఖ్యమంత్రా దామోదర రాజనర్సింహతో భేటీ అయింది. ఇంజినీరింగ్‌ కళాశాలల తనిఖీ త్వరలో ప్రారంభిస్తామని అనంతరం అధికారలు వెల్లడించారు. బి-కేటగిరి సీట్లను ప్రభుత్వమే భర్తీ చేసేలా ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు చెప్పారు.…

వార్తలు

అసోంలో కొనసాగుతున్న అల్లర్లు

గౌహతి: అసోంలో అల్లర్లు కొనసాగుతున్నాయి. కోక్రాఝార్‌ జిల్లాలో ఆదివారం జరిగిన అల్లర్లులో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను బొంగాయిగాస్‌ ఆసుపత్రికి తరలించారు. సలకాటి రైల్వేస్టేషన్‌ సమీపంలో గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడినట్లు లా అండ్‌ ఆర్డర్‌ ఐజీ బిష్నోయి మీడియాకు…

హైదరాబాద్

ముగిసిన డిఎస్సీ మొదటి పరీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా డిఎస్‌సి స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వేజ్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ముగిసింది. డీఎస్సీ మూడు రోజుల పాటు నిర్వహించే పరీక్షలలో ఇదే మొదటి పరీక్ష. మధ్యాహ్నం 2 గంటలకు స్కూల్‌ అసిస్టెంట్‌ సబ్జెక్ట్‌ పరీక్ష నిర్వహిస్తారు.

వార్తలు

సోనియాకు పరిస్థితిని వివరిస్తా: రాయపాటి

గుంటూరు: తితిదే ఛైర్మన్‌ పదవి దక్కనందుకు గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే పార్టీకి రాజీనామా చేస్తున్న వార్తను ఆయన ఖండించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పరిస్థితిని వివరిస్తానని.. అంతా వేచి చూడాలని, ఎవరూ…

వార్తలు

అండర్‌-19 ప్రపంచకకవ్‌ విజేత భారత్‌

టౌన్స్‌విలే: అండర్‌-19 ప్రపంచ కవ్‌ను భారత్‌ సొంతం చేసుకొంది. ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. ఉమ్మక్తచంద్‌ సెంచరీ (111), స్మీత్‌పటేల్‌ అర్థశతకం (62)తో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.…

జిల్లా వార్తలు

మంత్రుల బృందాన్ని అడ్డుకునేందుకు యత్నం

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రి పరిశీలనకు వచ్చిన మంత్రుల బృందానికి నిరసనలు ఎదురయ్యాయి. మంత్రులు కొండ్రుమురళి, సారయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే మంత్రుల బృందం పర్యటనకు వ్యతిరేకంగా అత్యవసర విభాగం వద్ద జూడాలు ధర్నా చేపట్టారు.…

హైదరాబాద్

ఎయిర్‌టెల్‌ మారథాన్‌ ముగింపులో పాల్గొన్నా గవర్నర్‌

హైదరాబాద్‌: ఎయిర్‌టెల్‌, హైదరాబాద్‌ రన్నర్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో నెక్లెస్‌ రోడ్డు వద్ద ప్రారంభమైన మారధాస్‌ గచ్చిబౌలి స్టేడియంలో ముగిసింది. రస్‌ ముగింపు కార్యాక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.