Wednesday, 4 November 2026

August 2012

హైదరాబాద్

రాయలసీమ పరిరక్షణ సమితి భేటీ

హైదరాబాద్‌: రాయలసీమ పరిరక్షణ సమితి సభ్యులు ఖైరతాబాద్‌లోని శ్రీధర్‌ పంక్షన్‌ హాల్‌ భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అంశంపై, తాజా రాజకీయ పరిస్థితులపై సభ్యులు చర్చించారు.

హైదరాబాద్

బీసీ రిజర్వేషన్లపై వైకాపా రాజకీయాలు: దేవేందర్‌గౌడ్‌

హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్లను వైకాపా రాజకీయం చేస్తోందని తెదేపా నేత దేవేందర్‌గౌడ్‌ ఆరోపించారు. బీసీలపై వైకాపా నేతల కపట ప్రేమను కనబరుస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బోథనా రుసుములపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని…

వార్తలు

రాయపాటి అనుచరుల అసంతృప్తి

గుంటూరు: తితిదే ఛైర్మన్‌ పదవి ఎంపీ రాయపాటికి ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గంటూరులోని రాయపాటి నివాసానికి పెద్ద సంఖ్యలో అనుచరులు చేరుకున్నారు. కాంగ్రెస్‌లో కొనసాగరాదని రాయపాటిపై ఒత్తిడి చేస్తున్నారు.

హైదరాబాద్

నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం

హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఫాలోఅస్‌లో ఉన్న కివీస్‌ మూడు రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్‌ నష్టానికి 41…

జిల్లా వార్తలు

మేడ్చల్‌ జాతీయ రహదారిపై ఆర్టీఏ తనిఖీలు

రంగారెడ్డి: మేడ్చల్‌ జాతీయ రహదారిపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 3 పర్యాటక బస్సులు, ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న 7లారీలను పట్టుకున్నారు. వాహనాల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలియజేశారు.

వార్తలు

చైనాలో రోడ్డు ప్రమాదం…36 మంది మృతి

బీజింగ్‌: ఉత్తర చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షాంజీ ప్రాంతంలోని యానస్‌ పట్టణానికి సమీపంలో ఓ డబుల్‌డెక్కర్‌ బస్సు ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను అదుపుతప్పి ఢికొంది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.…

హైదరాబాద్

16వ శతాబ్దానికి చెందిన నాణేలు లభ్యం

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ మండలం కవాడీపల్లిలో పురాతన నాణేలు లభ్యమయ్యాయి. 16వ శతాబ్దానికి చెందిన ఈ స్టిండియా కంపెనీ నాణేలుగా వాటిని గుర్తించారు. ఓ గొర్రెల కాపరికి ఈ నాణేలు దొరికినట్లు సమాచారం.

వార్తలు

బాలీవుడ్‌ నటుడు ఏకే హంగల్‌ కన్నుమూత

ముంబయి: పాతతరం బాలీవుడ్‌ నటుడు  ఏకే హంగల్‌ కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హంగల్‌ మృతి చెందారు. దాదాపు  200 సినిమాల్లో హంగల్‌ నిటించారు.

హైదరాబాద్

నేడు తెలంగాణ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ భేటీ

హైదరాబాద్‌: ఈ రోజు తెలంగాణ పబ్లిక్‌ ప్రాజిక్యూటర్స్‌ సమావేశం ఉదయం 11:30కి తాజ్‌మహల్‌ హోటల్‌లో జరగుతుంది ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌లు ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.

జిల్లా వార్తలు

పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగి మండలం నక్కల్‌ గ్రామలో విషాద సంఘటన జరిగింది. బావిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.