Monday, 16 November 2026

అసోంలో కొనసాగుతున్న అల్లర్లు

గౌహతి: అసోంలో అల్లర్లు కొనసాగుతున్నాయి. కోక్రాఝార్‌ జిల్లాలో ఆదివారం జరిగిన అల్లర్లులో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను బొంగాయిగాస్‌ ఆసుపత్రికి తరలించారు. సలకాటి రైల్వేస్టేషన్‌ సమీపంలో గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడినట్లు లా అండ్‌ ఆర్డర్‌ ఐజీ బిష్నోయి మీడియాకు తెలిపారు. శనివారం చిరాంగ్‌ జిల్లా అమ్గురి బజార్‌లో అల్లర్ల చోటుచేసుకొని ఆరుగురు మృతి చెందారు. దీంతో అల్లర్ల ఘటనలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 86కి చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *