Wednesday, 4 November 2026

August 2012

వార్తలు

గుంటూరు జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

గుంటూరు: గుంటూరు జిల్లా ముప్పాల మండలం మాదలలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ముగ్గురి  పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వార్తలు

ప్రకాశం బ్యారీజీ వద్ద ధర్నా చేసి తీరుతాం: దేవినేని ఉమ

విజయవాడ: ప్రభుత్వం ఎన్ని అడ్డుంకులు సృష్టించినా ప్రకాశం బ్యారేజి వద్ద ధర్నా చిసి తీరుతామని తెదేపా ఎమ్మెల్యే దేవినేని  ఉమ స్పష్టం చేశారు. రైతులు, తెదేపా నేతలను అడ్డుకొని ప్రభుత్వం ఏం సాధిస్తుందని ఆయన ప్రశ్నించారు. బ్యారేజీ వద్ద…

హైదరాబాద్

భారత స్పిన్నర్ల దాటికి 159పరులకే న్యూజిలాండ్‌ అలౌట్‌

హైదరాబాద్‌: ఉప్పల్‌లో జరుగుతున్న భారత్‌ న్యూజిలాండ్‌ దేశాల మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు న్యూజిలాండ్‌ వెన్నువిరిచారు. 159 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ఆలౌట్‌ అయింది. దాంతో న్యూజిలాండ్‌కు ఫాలో ఆన్‌ తప్పలేదు. భారత్‌ బౌలింగ్‌లో అశ్విన్‌6, ఓజా3…

కరీంనగర్

భూతగాదాలతో అన్నను చంపిన తమ్ముడు

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో విషాదం చోటు చేసుకుంది. భూతగాదాలతో అన్నను తమ్ముడు చంపేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వార్తలు

పేటెంట్‌ కేసులో స్యామ్‌సంగ్‌పై ఆపిల్‌ కంపెనీ విజయం

సాన్‌జోన్‌: పేటెంట్‌ హక్కుల అతిక్రమణ కేసులో ఆపిల్‌ కంపెనీ స్యామ్‌సంగ్‌పై విజయం సాధించింది. తన ఉత్పత్తులైన ఐఫోన్‌, ఐపాడ్‌ల నుంచి కీలక ఫీచర్స్‌ను కాపీ కొట్టినందుకు నష్టపరిహారంగా స్యామ్‌సంగ్‌ 1.05 బిలియన్‌ డాలర్లను ఆపిల్‌ కంపెనీకి చెల్లించాలని కాలిఫోర్నియాలోని…

వార్తలు

ప్రకాశం బ్యారేజీ వద్ద నేతలను అడ్డుకుంటున్న పోలీసులు

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద చేపట్టనున్న  మహాధర్నాకు తరిలివస్తున్న నేతలను రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. బ్యారేజీ వద్ద ముళ్లకంచెలను ఏర్పాటు చేసి పాదయాత్రగా వస్తున్న ఎమ్మెల్యే దేవినేని ఉమతో పాటు కార్యకర్తల్ని, రైతులను అడ్డుకున్నాఉ. దీంతో నేతలకు పోలీసులకు…

జిల్లా వార్తలు

ఎంజీఎంలో మరో చిన్నారి మృతి

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు కొనసాగుతున్నాయి. పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మూడెళ్ల బాలుడు నాగరాజు ఈ ఉదయం మృతి చెందాడు. దీంతో నిన్న రాత్రి నుంచి ఆసుపత్రిలో మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. పిల్లల…

జిల్లా వార్తలు

వరంగల్‌లో గుడిసెల తొలగింపు ఉద్రిక్తం

వరంగల్‌: హన్మకొండ సమ్మయ్యనగర్‌లో గుడిసెల తొలగింపు ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ భూముల్లో వెలిసిన గుడిసెల తొలగింపునకు ఈ ఉదయం అధికారులు చర్యలు చేపట్టారు. అయితే స్ధానికులు అధికారులను అడ్డుకొని వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇక్కడ ముందుజాగ్రత్త చర్యగా…

హైదరాబాద్

ఆలస్యంగా ప్రారంభం కానున్న మూడో రోజు ఆట

హైదరాబాద్‌: వర్షం కారణంగా ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న భారత్‌ న్యూజిలాండ్‌ తొలి టెస్టు మూడో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కానుంది. నిన్న భారత్‌ 438 పరుగులకు ఆలౌట్‌ కాగా.. అనంతరం ఇన్నింగ్స్‌కు ప్రారంభించిన కివీస్‌ 5 వికెట్ల…

వార్తలు

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌: ఛతీస్‌గఢ్‌లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. నారాయణ్‌పూర్‌ జిల్లా పసేగావ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కాల్పులు  జరిగాయి. నలుగురు మహిళా మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారు.