Friday, 6 November 2026

August 2012

జాతీయం

తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముకంగా లేదు:జవదేకర్‌

ఢిల్లీ: తెలంగాణపై బీజేపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగుతుంది. తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం సముకంగా లేదని జవదేకర్‌ విమర్శించారు. తెలంగాణ విమోచన దినాన్ని జరిపేందుకు ప్రభుత్వం వెనకాడుతుందని, ప్రతి విషయంలో తెలంగాణకు అన్యాయమే జరుగుతుందని తెలంగాణ…

Featured News

మయిన్మార్‌లో ముస్లిం ఊచ కోత నిలిపివేయాలని కాశ్మీర్‌లో ప్రదర్శన నిర్వహిస్తున్న ముస్లిం మహిళలు

మయిన్మార్‌లో ముస్లిం ఊచ కోత నిలిపివేయాలని కాశ్మీర్‌లో ప్రదర్శన నిర్వహిస్తున్న ముస్లిం మహిళలు

హైదరాబాద్

రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలి-హరీష్‌రావు

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కోతల్లో కూడా సీఎం కిరణ్‌ సర్కార్‌ వివక్ష చూపుతోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. కరెంటు కోతలపై త్వరలోనే ట్రాన్స్‌కోను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో కోతలు ఎక్కువగా ఉన్నయని ఆవేదన వ్యక్తం చేశారు.…

హైదరాబాద్

యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈశాన్యరాష్ట్ర వాసులకోసం హెల్ప్‌లైన్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో నివసిస్తున్న ఈశాన్య రాష్ట్రాలవారి సహాయం కోసం యువజన కాంగ్రెస్‌ తరపున హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి తెలిపారు. 9000999662 నెంబరుకు ఫోను చేస్తే యువజన కాంగ్రెస్‌ తరపున సహాయం చేస్తామని తెలిపారు.

జిల్లా వార్తలు

విద్యుత్‌ కోతకు నిరసనగా రైతుల రాస్తారోకో

నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని బోధన్‌ హైదరాబాద్‌ రోడ్డుపై శుక్రవారం మండలానికి చెందిన రైతులు విద్యుత్తు కోతలకు నిరసనగా రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. నిరంతరాయంగా ఏడుగంటలపాటు విద్యుత్తు ఇస్తానన్న ప్రభుత్వం రెండు గంటలు కూడా ఇవ్వటం లేదన్నారు.…

జిల్లా వార్తలు

వైకాపా కార్యాలయాల ప్రారంభం

బాల్కొండ: మండలంలోని నాగాపూర్‌, ఎల్కటూర్‌లలో ఈ రోజు వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి పర్యటించారు. రెండు గ్రామాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వం హయాంలో అభివృద్ది కుంటుపడిందని మళ్లీ వైఎస్‌ పాలన రావాలంటే వైకాపాను…

హైదరాబాద్

ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యలయం ముందు ఆటో డ్రైవర్ల దర్నా

హైదరాబాద్‌:ఆటో డ్రైవర్లకు లైసెన్సులు జారీ చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఎనిదవ తరగతి విద్యార్హతను తొలగించాలని ఖైరతాబాద్‌లోని రవాణ శాఖ కార్యలయం ముందు ఆటో డ్రైవర్లు దర్నా చేశారు. అధికారుల వైఖరి వల్ల వేలమంది ఉపాది కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు,…

జిల్లా వార్తలు

రైతు రుణ మేళాల నిర్వహణ

బాల్కొండ: బాల్కొండ మండలం సోన్‌పేట, దూదిగాం, చాకిరాల గ్రామాల్లో ఈరోజు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు రుణ మేళా కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకుల నుంచి ఇంతవరకు పంటరుణాలు తీసుకొని రైతులను గుర్తించారు. వారికి బ్యాంకుల నుంచి రుణాలిప్పిస్తామని వ్యవసాయాధికారి…

ఖమ్మం

మధిరలో రాస్తారోకో

మధిర: విద్యుత్‌కోతను నిరసిస్తూ శుక్రవారం మధిరలో పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించారు. పగలు, రాత్రి తేడా లేకుండా గంటల తరబడి కోత విధించటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు అన్నారు. స్థానిక ఎమ్మేల్మే ఉప సభాపతి మల్లు భట్టి…

జిల్లా వార్తలు

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

దమ్మపేట: మండలంలోని మందలపల్లి రాష్ట్రీయ రహదారిపై శుక్రవారం ఉదయం సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసి బస్సు లారీని ఢీకొంది. బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావటంతో ప్రమాదం జరిగింది. ప్రయాణికులకు గాయాలు కాలేదు. బస్సు ముందు భాగం మాత్రం దెబ్బతింది.