Wednesday, 4 November 2026

September 2012

వార్తలు

యశోదా ఆసుపత్రిలో వైద్యుడి అదృశ్యం

హైదరాబాద్‌: నగరంలోని మలక్‌పేట యశోదా ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న హర్షారెడ్డి కనిపించకుండా పోవడం సంచలనం సృష్టించింది. ఆయన కుటుంబసభ్యులు చాదర్‌ఘాట్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా వార్తలు

‘పీపుల్స్‌వార్‌’ అధ్భుతం : కేసీఆర్‌

హైదరాబాద్‌: దర్శకుడు, నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి తీసిన ౖౖ’పీపుల్స్‌వార్‌’ సినిమా అద్బుతంగా ఉందని టీఆర్‌ఎస్‌ అదినేత కేసీఆర్‌ తెలిపారు. ‘పీపుల్స్‌వార్‌’ ప్రివ్యూ చూసిన అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల వల్ల జరిగే నష్టాన్ని ఈ…

వార్తలు

జూనియర్‌ డార్టర్ల చర్చలు విఫలం

హైదరాబాద్‌: సమ్మె చేస్తున్న జూనియర్‌ డాక్టర్లతో ప్రభుత్వ వైద్య ఆరోగ్య కార్యదర్శి రత్నకిశోర్‌ నేతృత్వంలోని ప్రభుత్వ బృదం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అధికారులు తమ సమస్యపై స్పందించడం లేదని జూడాల ప్రతినిధులు ఆరోపించారు. ప్రభుత్వం లిఖితపూర్వకంగా హీమీ ఇచ్చేవరకు…

వార్తలు

ఆప్గనిస్థాన్‌లో ఉగ్రవాది దాడి 25 మంది మృతి

కాబూల్‌: ఆప్గనిస్థాన్‌లోని తూర్పుప్రాంతంలో జరిగిన అత్మాహుతి దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దర్బారా జిల్లాలోని షాగైలో గ్రామ పెద్ద అంతిమయాత్రపై ఉగ్రవాది అత్మాహుతి దాడి జరిపినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో గాయపడ్డ 30 మందిని…

వార్తలు

తెలంగాణ విశ్వ విద్యాలయంలో విద్యార్థి ఆత్మహాత్యాయత్నం

నిజామాబాద్‌: తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి మహేశ్‌ ఆత్మహత్యాయత్నం చేయడం విశ్వవిద్యాలయంలో కలకలం సృష్టించింది. విద్యార్థుల మధ్య ఘర్షణ జరగడంతో అతను విషం తాగినట్టు తెలుస్తోంది. విశ్వవిద్యాలయ సిబ్బంది సహచరవిద్యార్థులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.

వార్తలు

శ్రీహరికోట షార్‌ సెంటర్లో హై ఎలర్ట్‌

సూళ్లూరుపేట: శ్రీహరికోట షార్‌ సెంటర్లో ఈ నెల 9వ తేదీన పీఎస్‌ఎల్‌వీ పీ 21 రాకెట్‌ ప్రయోగం ఉంది. రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధాని మన్మోహన్‌ రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం షార్‌ హై ఎలర్ట్‌ ప్రకటించింది

వార్తలు

ఐదుగురు మత్స్యకారుల గల్లంతు

తూర్పుగోదావరి జిల్లా: ఐ.పోలవరొం మండలం భైరవపాలెం వద్ద ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరందరూ విశాఖ జిల్లా నక్కపల్లికి చెందిన వారు. సముద్రతీరంనుంచి 18 కి.మీ.దూరంలో పడవ ప్రమాదానికి గురైనట్టు సమాచారమందింది. గల్లంతయినవారి కోసం రెవెన్యూయంత్రాంగం గాలింపుచర్యలు చేపట్టింది.

వార్తలు

నిరుపేదలకు ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ది అగ్రస్థానం

హైదరాబాద్‌: నిరుపేదలకు ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ బి. వెంకటేశం తెలిపారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ ప్రగతిని పవర్‌ పాయింట& ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. రాష్ట్రంలో పేదల కోసం కోటి పక్కా…

వార్తలు

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద నీరు చేరిక

హైదరాబాద్‌: శ్రీశైలం ప్రజెక్టుకు భారీ స్థాయిలో వరద నీరు చేరనుంది. తుంగభద్ర, అలమట్టి ప్రాజెక్టులకు కలిసి 80వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండటంతో మరికొన్ని రోజులపాటు శ్రీశైలానికి నీరు వదిలే అవకాశముంది. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్లు రెండూ…

వార్తలు

పంచాయతీ ఎన్నికల విషయంలో న్యాయస్థానం తీర్పును గౌరవిస్తాం: బొత్స

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల విషయంలో న్యాయస్థానం తీర్పును గౌరవిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. బీసీలకు జనాభా ప్రతిపదికన రిజర్వేషన్లు ఉండాలనేది తమ అభిప్రాయమన్నారు. కానీ, రాజ్యాంగం, న్యాస్థానం తీర్పులను గౌరవించాల్సి ఉందని తెలిపారు.