Wednesday, 4 November 2026

September 2012

ఆదిలాబాద్

వివేక్‌ దిష్టిబొమ్మ దహనం చేసిన ఎమ్మెల్సీ ప్రేవమ్‌సాగర్‌ వర్గీయులు

ఆదిలాబాద్‌: కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌ వర్గీయులైన మాజీ జడ్పీ చైర్మన్‌ గణపతి తదితరుల ఆధ్వర్యంలో ఎంపీ వివేక్‌, మాజీ మంత్రులు వినోద్‌, వెంకటస్వాముల దిష్టిబొమ్మలను దహనం చేశారు. వారికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.

హైదరాబాద్

గ్రూపు-1 జనరల్‌ ఇంగ్లీష్‌ పరీక్ష వాయిదా

హైదరాబాద్‌: ఈ నెల 16న జరగాల్సిన గ్రూపు-1 జనరల్‌ ఇంగ్లీష్‌ పరీక్షను సెప్టెంబర్‌ 28 కి ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ కొత్త హాల్‌టికెట్లు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచుతామని అధికారులు…

జిల్లా వార్తలు

తండ్రి మందలించాడనే కారణంతో పురుగుల మందు తాగి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

వరంగల్‌: చిట్యాల మండలంలోని బావుసింగ్‌పల్లె గ్రామానికి చెందిన తోటకూర స్రవంతి అనే డిగ్రీ విద్యార్థిని ఆమె తండ్రి మందలించాడు. దీంతో తీవ్ర మనస్థాపానకి గురైన ఆమె పురుగుల మందుతాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించి స్థానికులు స్రవంతిని…

జిల్లా వార్తలు

సీతారాంపూర్‌ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

రంగారెడ్డి: షాబాద్‌ మండలంలోని సీతారాంపూర్‌ గ్రామానికి చెందిన కృష్ణమ్మ అనే మహిళ గ్రామ శివారులో అనుమానాస్పదంగా మృతి చెందినది. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహన్ని స్దాధినం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కరీంనగర్

కొడిమ్యాల ప్రభుత్వ పాఠశాలలో బస్సుపాసులు పంపిణీ చేసిన ఆర్టీసీ

కొడిమ్యాల: స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతున్న 100మంది విద్యార్థులకు వేములవాడ ఆర్టీసీ అధికారులు ఉచితంగా బస్సు పాసులు అందజేశారు.

కరీంనగర్

మెట్‌పల్లిలో రాస్తారోకో

మెట్‌పల్లి: ఢిల్లీలో బీజేపీ నాయకులు ప్రధాని నివాస ముట్టడిని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మెట్‌పల్లిలో బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.

కరీంనగర్

మెట్‌పల్లిలో పోషకాహరంపై గర్భిణులకు అవగాహన సదస్సు

మెట్‌పల్లి: మండలంలోని ఆరిపేట గ్రామంలో బాలింతలకు, గర్భిణులకు పోషకాహరంపై అవగాహన కల్పించారు. పోషకాహరంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకురుతుందని నిర్వహకులన్నారు.

హైదరాబాద్

చంద్రబాబుతో సహా పార్టీకి చెందిన కార్యకర్తల అరెస్ట్‌

హైదరాబాద్‌: ఫీజు రియింబర్స్‌మెంట్‌ విషయంలో పేద విద్యార్థులకు ప్రభుత్వం చేస్తున్న అన్నాయానికి నిరసనగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎల్‌బీనగర్‌ చౌరస్తాలో ధర్నా చేపట్టారు.. బీసీలకు పూర్తిగా ఫీజు రియింబర్స్‌మెంట్‌ చెల్లించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ చౌరస్తాలో బాబు బైఠాయించారు.…

కరీంనగర్

ఢిల్లీలో బీజేపీ నాయకులపై లాఠీచార్జీకి నిరసనగా ఖనిలో నాయకుల ధర్నా

గోదావరిఖని: ఢిల్లీలో బీజేపీ నాయకులపై లాఠీచార్జీకి నిరసనగా గోదావరిఖనిలో బీజేపీ నాయకులు పట్టణంలోని రాజీవ్‌రహదారిపై రాస్తా రోకో చేశారు