Wednesday, 4 November 2026

September 2012

హైదరాబాద్

హైకోర్టు తీర్పును స్వాగతించిన లోక్‌సత్తా

హైదరాబాద్‌: స్థానికసంస్థలకు ఎన్నికలు జరపాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును లోక్‌ సత్తా స్వాగతించింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్నికలు నిర్వహించాలని ఆ ఆ పార్టీనేత కఠారి శ్రీనివాసరావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ల అంశం…

వార్తలు

రాజపక్సే భారత్‌ పర్యటనను వ్యతిరేకించిన డీఎంకే

చైన్నై : శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే త్వరలో భారత్‌లో జరపనున్న పర్యటన తమకు సమ్మతం కాదని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అన్నారు. వేలాదిమంది. శ్రీలంక తమిళుల వూచకోతకు కారణమైన రాజపక్సేకు భారత్‌లో పర్యటించే అర్హత లేదన్నారు. అయితే శ్రీలంక…

కరీంనగర్

వెల్గటూర్‌లో భూవాణికార్యక్రమం

కరీంనగర్‌: వెల్గటూర్‌ తభశీసీల్దారు కార్యలయంలో భూవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ.రెవెన్యూ సంబందిత సమస్యల పరిష్కారాని ప్రజలనుంచి స్వయంగా అధికారులు ధరఖాస్తులు స్వీకరించి పరిశీలించారు.

కరీంనగర్

అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్న రెవెన్యూ అధికారులు

కరీంనగర్‌: పెద్దపల్లిలోని సివిల్‌ సప్లయ్‌ గోదాం నుంచి రేషన్‌ దుకాణాలకు బియ్యం రవాణా చేస్తున్న వాహనంలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు. దీనిపై విచారణ చేపట్టారు.

కరీంనగర్

బీజేపీ రాస్తారోకో

కరీంనగర్‌: తెలంగాణ కోసం ఢిల్లీలో చేపట్టిన దీక్షా శిబిరంలో పాల్గొన్న పెద్దపల్లి కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు దాడి చేయాటాన్ని నిరసిస్తూ పెద్దపల్లిలో రాస్తారోకో నిర్వహించారు

కరీంనగర్

బతికపల్లిలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య

కరీంనగర్‌:పెగడపల్లి మండలంలోని బతికపల్లి గ్రామంలో నల్ల లక్ష్మీనారాయణ(40)ఈరోజు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేత కార్మికుడైన ఈయన 3సం. వరకు సిరిసిల్లలో కార్మికునిగా పనిచేసి ఆనారోగ్యానికి గురయ్యాడు. దీంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తోడవటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు…

కరీంనగర్

పాఠశాలో మొక్కలునాటే కార్యక్రమం

కరీంనగర్‌:జూలపల్లి మండలంలోని పెద్దపూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తశీల్దారు వెంకటమాధరావు 50మొక్కలు నాటారు. విద్యార్థులు చిన్ననాటినుండే పర్యావరణంపై అవగాహ కల్పించాలన్నారు. విద్యార్థికొక మొక్కను పెంచే బాధ్యతను అప్పగించాలన్నారు.

కరీంనగర్

రహదారిని ఆక్రమించారని ఎడ్లబండ్లతో గ్రామస్తుల రాస్తారోకో

కరీంనగర్‌:జూలపల్లి మండలంలోని తేలుకుంట గ్రామాస్థులు రహదారి సౌకర్యం కల్పించాలంటూ ఎడ్లబవడ్లతో ఆందోళన చేపట్టారు. సర్వే నెంబర్‌ 1597గుండా రహదారి ఉండగా ఆ స్థలాన్ని ఆక్రమించారన్నారు. రెవెన్యూ అధికారులు ఇంటిస్థలం మంజూరి చేయటంతో సమస్య తలెత్తిందని వెంటనే పరిష్కరించాని డిమాండ్‌…

వార్తలు

తెలంగాణ కోసం ఈ నెల 30న భారీ ఉద్యమం:జేఎసీ

న్యూఢిల్లీ: తెలంగాణ అంశాన్ని నాన్చితే ఈ నెల 30న భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని తెలంగాణ రాజకీయ జేఎసీ నేతలు హెచ్చరించారు. ఆ తరువాత జరిగే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత వహించాలని కూడా  చెప్పారు. జేఎసీ ఛైర్మన్‌ కోదండరాం…

ఆదిలాబాద్

కార్యదర్శులకు సన్మానం

ఆదిలాబాద్‌: తాంసి మండలంలోని వడూర్‌, వడ్డారి గ్రామాల్లో సుదీర్ఘ కాలం పనిచేసి ఇటీవలే బదిలీ అయిన అశోక్‌,రాజాలను ఈ రోజు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఎంపీడీవో, తహసీల్దారు పాల్గొన్నారు.