Wednesday, 4 November 2026

September 2012

కరీంనగర్

యువతి ఆత్మహత్య

కొడిమ్యాల: మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన మమత(20) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. మమత జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది.

కరీంనగర్

మన్మోహన్‌సింగ్‌ రాజీనామా చేయాలి

కమలాపూర్‌: మండలంలో అవినీతిలో కూరుకుపోయిన కేంద్ర ప్రభుత్వం గద్దె దిగాలని దానికి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

వార్తలు

కేంద్ర మంత్రి వాయలార్‌ రవిని కలిసిన కోదండరాం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి వాయలార్‌ రవిని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం కలిశారు. కేంద్రం తెలంగాణ అంశంపై త్వరగా తేల్చాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. తమ నిర్ణయాన్ని కార్యచరణలో చూపెడతామని…

ఎడిట్ పేజీ

అన్నీ శుభ శకునాలే !

ప్రస్తుత కాలంలో తెలంగాణ విషయంలో అన్నీ శుభ శకునాలు ఎదురవుతున్నాయి. శుభవార్తలే వినిపిస్తున్నాయి. నడుస్తున్న పరిణామాలను చూస్తుంటే ఆ ‘కొత్త పొద్దు’ను చూసే రోజులు ఎంతో దూరంలో లేవనే నమ్మకం కలుగుతున్నది. నాలుగున్నర కోట్ల మంది ఆరున్నర దశాబ్దాలుగా…

హైదరాబాద్

జూనియర్‌ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

హైదరాబాద్‌: జూనియర్‌ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రత్నకిశోర్‌ అన్నారు. నెలరోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జూనియర్‌ డాక్టర్ల్‌ తక్షణం సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని మార్గాలు విఫలమైతే…

వార్తలు

భాజపా కార్యకర్తల అరెస్టు

ఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుచేయాలని ప్రధాని నావాసం వద్ద ఆందోళనచేసిన భాజపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నివాసం వైపు ర్యాలీగా వెళుతున్న వారిని అడ్డుకుని వాటర్‌క్యానన్లు, భాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు అనంతరం వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు…

హైదరాబాద్

బొగ్గు కుంభకోణంలో నన్ను ప్రశ్నించలేదు:దాసరి నారాయణరావు

హైదరాబాద్‌: బొగ్గు కుంభకోణంలో సీబీఐ అధికారులు తనను ప్రశ్నించలేదని తనకు సంబంధించిన సంస్థలు, కార్యాలయాల్లో సోదాలు జరగలేదని దాసరి నారాయణరావు తెలిపారు. బొగ్గుగనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో ఆ శాఖలో సహాయమంత్రిగా పనిచేసిన దాసరి…

వార్తలు

మండలి బుద్ధప్రసాద్‌ దీక్ష విరమణ

విజయవాడ: కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలంటూ మూడురోజులుగా దీక్ష చేస్తున్న మండలి బుద్దప్రసాద్‌ ఈ రోజు దీక్ష విరమించారు. డెల్టాకు ఇబ్బంది లేకుండా చూస్తామన్న ప్రభుత్వ హామీతో ఆయన దీక్షను విరమించారు.

జిల్లా వార్తలు

ఉప్పోంగిన వాగు-నిలిచిపోయిన వాహనాలు

భూపాలపల్లి: మండలంలోని మూరంచెవాగు ఉప్పోంటంతో పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై సోమవారం అర్ధరాత్రినుంచి మంగళవారం సాయంత్రం వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

జిల్లా వార్తలు

కోల్‌ఫిల్లర్‌పై బోగ్గు పెళ్లలు పడి కార్మికుడి మృతి

భూపాలపల్లి: సింగరేణి డివిజన్లో కాకతీయఖని 1గనిలో ఈ రోజు ముక్క ఆనందం(46) కోల్‌ఫిల్లర్‌పై బొగ్గు పెళ్లలు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులున్నారు.