హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న నెక్లెస్ రోడ్డులో ఉద్రిక్త వాతావరణం తెలంగాణ కవాతుకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతి సమయం ముగిసింది. కానీ నిర్వాహకులు మాత్రం తెలంగాణ వచ్చే వరకూ ఇక్కడే కూర్చుందామని ప్రకటించడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. నెక్లెస్ రోడ్డు నుంచి తెలంగాణ వాదులను చెదరగొట్టేందుకు ఓ వైపు పోలీసులు ప్రయత్నిస్తుండగా, మరో పక్క భారీ వర్షం కురుస్తోంది. దీంతో తెలంగాణావాదులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నెక్లెస్ రోడ్డులో ఉన్నవారంతా భారీ వర్షానికి తడిసి ముద్దయ్యారు. ఓ వైపు ఉద్రికత్త కొనసాగుతుండగేనే మంత్రులు ఇక్కడకు చర్చలకు రావాలని కోదండరాం పేర్కొనడం ఉత్కంఠకు తెరలేపింది. గడువు ముగిసిన తర్వాత కవాతును భగ్నం చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున వాటర్ క్యానన్‌లు, టియర్ గ్యాస్‌ను ప్రయోగిస్తున్నారు. కానీ నేతలు మాత్రం సభాస్థలిని వీడేందుకు సిద్దపడటంలేదరు.




