Monday, 2 November 2026

September 2012

వార్తలు

రాత్రి 7 గంటల తర్వాత కూడా కవాతు కొనసాగుతుంది: కోదండరాం

హైదరాబాద్‌: ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత కూడా కవాతు కొనసాగుతుందని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలిపారు. నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పోలీసులు అణిచివేత ధోరణి మానుకోవాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా…

వార్తలు

జనంమీద వాటర్‌ కెనన్లు ప్రయోగం

హైదరాబాద్‌: సీమాంద్ర రాక్షస ప్రభుత్వం బరితెగించింది. ఇంకా మార్చ్‌ ముగియడానికి సమయం ఉన్నా తెలంగాణ మార్చ్‌కు హాజరైన జనంపై పోలీసులు వాటర్‌ కెనన్లును ప్రయోగిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన తెలంగాణావాదులు పోలీసులపై తీరగబడ్డారు. ప్రస్తుతం పిరస్థితి ఉద్రిక్తంగా ఉంది.

వార్తలు

ఆస్ట్రేలియా విజయం

కొలంబో: టీ 20 ప్రపంచకప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 17.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

వార్తలు

న్యూస్‌ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేసిన సర్కారు

హైదరాబాద్‌: తెలంగానోడి దెబ్బకు సీమాంద్ర సర్కారుకు ముచ్చెమటలు పట్టాయి. తెలంగాణ మార్చ్‌కు తరలి వచ్చిన ఆశేష జనవిహినికి భయపడి, కార్యక్రమం విజయవంతం అయినందున వార్తలను యావత్‌ ప్రపంచం తెలుసుకోకూడదు అన్న ఆలోచనతో రాష్ట్రంలోని అన్ని న్యూస్‌ ఛానళ్ల ప్రసారాలను…

వార్తలు

ప్రభుత్వం అణచివేత ధోరణి మానుకోవాలి: గుండా మల్లేష్‌

హైదరాబాద్‌: ప్రభుత్వం అణచివేత ధోరణి మానుకోవాలని సీపీఐ శాసనభపక్షనేత గుండా మల్లేష్‌ అన్నారు. నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని, తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు కొత్తకాదని పేర్కొన్నారు.

వార్తలు

కవాతును అడ్డుకోవడం అనైతికం:నాగం

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు పోలీసులు అడ్డుకోవడం అనైతికమని నాగర్‌ ర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. కవాతులో భాగంగా నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటుచేసిన సభలో నాగం మాట్లాడుతూ ఏమాత్రం ప్రాణ నష్టం జరిగినా ప్రభుత్వం కూలుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో అప్రకటిత…

Cover Story

ఇది ఆఖరి పోరాటం

తెలంగాణ ప్రకటించేవరకు కదిలేది లేదు : కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 (జనంసాక్షి)  : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించే వరకు నెక్లెస్‌ రోడ్డు సాగరహారాన్ని వదిలి వెళ్లేది లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు.…

హైదరాబాద్

2 పోలీసువాహనానికి నిప్పు

హైదరాబాద్‌:  నెక్లెస్‌ రోడ్డు తెలంగాణవాదులకు, పోలీసులకు  మధ్య  ఘర్షణ వాతావరణం నెలకొంది.                     నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజా వద్ద ఆందోళనకారులు 2 పోలీసు వాహనాలకు నిప్పుబెట్టారు. ఐమ్యాక్స్‌నుంచి నెక్లెస్‌  రోడ్డుకు వెళ్లే రహదారిలో ఉద్రిక్తత నెలకొంది.

Featured News

తెలంగాణవాదులు శాంతికాముకులు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణవాదులు శాంతికాముకులని, దౌర్జన్యాలకు పాల్పడరని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం వ్యాఖ్యనించారు. మార్చ్‌ను విజయవంతం చేయాలని ఆయన తెలంగాణవాదులను కోరారు. హింసకు పాల్పడుతున్నది పోలీసులేనని, డీజీపీ రెచ్చ గొడుతున్నారని ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆకారణంగా…