Wednesday, 4 November 2026

September 2012

వార్తలు

మైనార్టీల సంక్షేమానికి 27న ఎన్టీఆర్‌ భవన్‌లో సదస్సు

హైదరాబాద్‌: మైనార్టీల సంక్షేమానికి ఏం చేయాలనే దానిపై చర్చించేందుకు, మైనార్టీ డిక్లరేషన్‌ రూపకల్పనకు ఈ నెల 27న తెలుగుదేశం మైనార్టీ నేతలు సమావేశం కానున్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగే ఈ సదస్సుకు పార్టీ అధినేత చంద్రబాబు కూడా హాజరవుతారు.…

వార్తలు

షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

లాహోర్‌: పాక్‌ నుంచచి భారత్‌కు బయలుదేరిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌లో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో కొన్ని గంటలపాటు ఆలస్యంగా నడిచినట్లు అధికారులు తెలిపారు. అప్రమత్తమైన డ్రైవర్‌ ఇంజిన్‌ని రైలు నుంచి వేరుచేశారు. రైలులోని వంద మంది ప్రయాణికులు…

వార్తలు

ఐర్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు

కొలంబొ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబొలో ఐర్లండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐర్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. ఐర్లండ్‌ జట్టులో ఒబ్రియన్‌ 25,…

వార్తలు

గాలి జనార్దన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలింపు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్‌ ముడుపుల కుసులో రేపు గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు.

వార్తలు

రాష్ట్రాన్ని విభజిస్తే ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలి: బైరెడ్డి

అనంతపురం: తరతరాలుగా రాయలసీమ వాసులు మోసపోతూనే ఉన్నారు. అన్నింటిని వదులుకున్నారు. ఇక్కడి ప్రజలకు జరిగిన అన్యాయంపై బహిరంగ చర్చకు రావాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్వవస్ధాపకులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మంత్రులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని విభజిస్తే ప్రత్యేక రాయలసీమ…

వార్తలు

మంత్రి వయలార్‌ రవితో తెలంగాణ ఎంపీల భేటీ

ఢిల్లీ: కేంద్ర మంత్రి వయలార్‌ రవితో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు బలరాం నాయక్‌, మంద జగన్నాథం, వివేక్‌, రాజయ్య భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు వీరు వయలార్‌తో చర్చలు జరిపారు. అనంతరం బరరాంనాయక్‌ మీడియాతో మాట్లాడుతూ…

వార్తలు

తెలంగాణపై ప్రకటన చేయాలి : విద్యాసాగరరావు

హైదరాబాద్‌: జీవవైవిధ్య సదస్సుకు తెలంగాణ ఉద్యమన్ని అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్సిస్తోందని భాజపా ఆరోపించింది. ప్రధాని జోక్యం చేసుకుని తెలంగాణ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ కేంద్ర సహాయమంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌ రావు డిమాండ్‌ చేశారు. సోమవారమిక్కడ…

వార్తలు

తిరువనంతపురం నుంచి చెన్నైకు వెళ్లే రైలులో 13 కిలోల బంగారం చోరి

కోయంబత్తూరు: తిరువనంతపురం నుంచి చెన్నైకు వస్తున్న రైలులో 13 కిలోల బంగారం చోరీ అయింది. చెన్నై షహుకారుపేట ఎన్నెస్సీ బోన్‌ రోడ్డుకు చెందిన వినోద్‌కుమార్‌ జైన్‌ స్థానికంగా నగల దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయన వద్ద పని చేస్తున్న వరదరామ్‌(45),…

వార్తలు

రాష్ట్రంలోని 43మంది ఉర్దూ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం

హైదరాబాద్‌: ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులను హైదరాబాద్‌లో అవార్డులతో సత్కరించారు. మైనార్టీ సంక్షేమశాఖమంత్రి ఆహ్మదుల్లా చేతులమీదుగా వారికి అవారు,శాలువా, ప్రశంసాపత్రం బహుకరించారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు కళాశాలలు, పాఠశాలల్లో పనిచేసే 43 మంది ఉపాధ్యాయులు ఈ అవార్డులు అందుకున్నారు

వార్తలు

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌

కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబొలో ఐర్లండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది.