Wednesday, 4 November 2026

September 2012

వార్తలు

రెండ్రోజుల్లో తెలంగాణపై స్సష్లత: చంద్రబాబు

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై రెండ్రోజుల్లో స్సష్టత ఇవ్వనున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో బాబు మాట్లాడారు. తెలంగాణ నేతలతో మాట్లాడి ఓ నిర్ణయానికి రానున్నట్లు పేర్కొన్నారు.

వార్తలు

ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో వృద్దులకు రాయితీ ఇవ్వాలి: మందకృష్ణ

హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో వృద్దులకు రాయితీ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ ఆధ్యర్యంలో సీనియర్‌ సటిజన్‌ సంఘం ప్రతినిధులు రవాణాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి సిజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఛార్జీల్లో 50 శాతం రాయితీ ఇవ్వడంపై 2004లోనే…

వార్తలు

అమెరికా-భారత్‌ దేశాల మధ్య సంబంధాలు మెరుగు

హైదరాబాద్‌: భారత్‌-అమెరికా దేశాల మధ్య మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయని, తర్వారా ఇరు దేశాల్లో వ్యాపార అవకాశాలు క్రమంగా విస్తరిస్తున్నాయని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ కాథరిన్‌ ధానాని చెప్పారు. గతంలో పోలిస్తే అమెరిక వీసా నిబంధనలు సరళతరంగా మారాయని…

Cover Story

తెలంగాణ కోసం విద్యార్థులు మంజీరా నదిలో జలదీక్ష

అరెస్ట్‌ చేసిన పోలీసులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): తెలంగాణ కోసం తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్నంగా నిరసనకు దిగారు. మధ్యప్రదేశ్‌, కూలంకుళం తరహాలో మంజీరా నదిలో దిగి ఆదివారం జలదీక్షకు పూనుకున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని…

వార్తలు

లక్ష్మణ్‌బాపూజీ మృతికి యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ సంతాపం

హైదరాబాద్‌: స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ మృతి పట్ల యూపీఏ ఛైరపర్సన్‌ సోనియాగాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి కొండా లక్ష్మణ్‌ బాపూజీ కుమార్తె పవిత్ర వాణికి లేఖ ద్వారా సానుభూతి తెలిపారు. దేశం ఓ…

వార్తలు

ఆర్థిక సంస్కరణలపై చర్చించేందుకు కేంద్రమంత్రివర్గ భేటీ

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7 శాతం కరవుభత్యం పెంపు ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించింది. ఆర్థిక సంస్కరణలపై చర్చించేందుకు కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ భేటీ అయింది. రేషన్‌ చక్కెర ధర పెంపు, దుకాణాలు, రాష్ట్ర…

వార్తలు

ఎమ్మార్‌ కేసులో నిందితుడికి బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో నిందితుడు విజయరాఘవకు సీబీఐ కోర్టు ఈరోజు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.లక్ష, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఎమ్మార్‌ కేసులో విజయరాఘవను జనవరి 28న సీబీఐ అధికారులు అరెస్టుచేశారు.

వార్తలు

తెలంగాణ కవాతు ఆపే ప్రసక్తే లేదు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ కవాతు ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. టీఎన్జీవో భవన్‌లో ఏర్పాటు చేసిన ఐకాస స్టీరింగ్‌ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఐకాసనేతలు మీడియాతో మాట్లాడారు. కవాతును శాంతియుతంగా…

వార్తలు

నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: ఈరోజు సెన్సెక్స్‌ కేంద్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం పెద్దఎత్తున ర్యాలీ కొనసాగిన మార్కెట్లో, ఈరోజు మాత్రం అస్థిరత్వం కన్పించింది. ప్రారంభంలో నమోదైన లాభాలను తుడిచిపెట్టి 79 పాయింట్ల నష్టంతో ముగిసింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ…

వార్తలు

గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల ఆందోళన

మహబూబ్‌నగర్‌: గిట్టుబాటు ధర ఇవ్వటం లేదంటూ దేవరకద్రలో రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఈరోజు ఉదయం దేవరకద్ర మార్కెట్‌ యార్డు కార్యదర్శి యాదగిరిరెడ్డిపై దాడిచేశారు. అనంతరం హైదరాబాద్‌-రాయచూర్‌ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో…