Thursday, 5 November 2026

September 2012

వార్తలు

మవోయిస్టుల కదలికలపై కూంబింగ్‌

ఆదిలాబాద్‌: తూర్పు జిల్లాలో మవోయిస్టుల కదలికలున్నాయన్న అనుమానంతో బుధవారం పోలీసులు జోరుగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతంలో పోలీసు పార్టీలు అడవులను జల్లెడ పడుతున్నారు.

వార్తలు

భారత్‌ 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు

కొలంబొ: శ్రీలంకలో జరుగుతున్న టీ 20 వరల్డ్‌కప్‌ క్రికెట్‌ పోటీల్లో భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆఫ్ఘన్‌ జట్టు ముందు…

వార్తలు

ప్రస్తుతం ప్రజలు ఎన్నికలను కోరుకోవడం లేదు : పృథ్వీరాజ్‌ చవాన్‌

ముంబయి: దేశంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ బుధవారం స్పష్టం చేశారు. కేంద్రంలోని యూపీఏ సర్కారు తృణమూల్‌ కాంగ్రెస్‌ తన మద్దతును ఉపసంహరించుకున్నప్పటికీ సంస్కరణలను బలపరచే పార్టీల మద్దతు ఉందని ఆయన…

వార్తలు

అడుగంటిన ప్రకాశం బ్యారేజీ

విజయవాడ: విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం మరోసారి పూర్తిగా అడుగంటింది. దీంతో నీటిమట్టం 10.7 అడుగులకు పడిపోయింది. ఎగువ నుంచి నీరు వచ్చే ఆశలు సన్నగిల్లడంతో కాల్వలు కట్టేసేయోచనలో నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు. డుల్టాలో ఇప్పటికే…

వార్తలు

గురజాడ 150వ జయంతి ఉత్సవాలు ప్రారంభం

విజయనగరం: వ్వవహార భాషకు పట్టంకట్టిన మహాకవి గురజాడ అప్పారావు 150వ జయంతి ఉత్సవాలు బుధవారం విజయనగరంలోని ఆయన స్వగృహంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వట్టి వసంతకుమార్‌ గురజాడ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. నేతలు గురజాడ ఇంటిని పరిశీలించిన అనంతరం అక్కడినుంచి గురజాడ…

వార్తలు

నాయకత్వ సృష్లి అనే అంశంపై ఓ సదస్సు

హైదరాబాద్‌: సంఘర్షణ లేకుండా నాయకత్వం పుట్టదని, సంఘర్షణనుంచే నాయకులు వస్తారని సౌండ్‌ ఆఫ్‌ మిలియన్స్‌ గ్లోబల్‌ ఫౌండేషన్‌ వ్వవస్థాపకులు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. నాయకత్వ లక్షణాలు పవిత్రంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చేందుతుందన్న ఆశయంతో నగరంలోని రవీంద్రభారతిలో…

వార్తలు

పాక్‌లో కారు బంబు పేలి 10 మంది మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లొని పెషావర్‌ నగర సరిహద్దులో ఒక కారు బాంబు పేలి 10 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన వ్యాన్‌ లక్ష్యంగా రిమోట్‌తో ఈ బాంబు పేల్నినట్లు పాక్‌ అధికారులు తెలిపారు.…

వార్తలు

టీ 20 ప్రపంచకప్‌ మ్యాచలో ఆస్ట్రేలియా ఘనవిజయం

కొలంబొ: టీ 20 ప్రపంచకప్‌ పోటీలో నేడు ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. తొలుత ఐర్లాండ్‌ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేయగా ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.

వార్తలు

రేపు పరిస్థితులకు అనుగుణంగా బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం

హైదరాబాద్‌: రేపు విపక్షాలు దేశవ్యాప్త బంద్‌కి పిలుపిచ్చిన నేపథ్యంలో పిరిస్థితులకు అనుగుణంగా బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. స్థానిక పోలీసుల సూచన మేకే బస్సులు నడుపుతామని, ఆర్టీనీ బస్సులకు ఆందోళనకారులు నష్టం కలిగించవద్దని సంస్థ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

వార్తలు

ఓఎస్‌జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజి

తూర్పుగోదావరి: సఖినేటిపల్లి మండలంలోని కేశవధాసుపాలెంలో ఓఎస్‌జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకైంది. ఓఎస్‌జీసీ సిబ్బందిగ్యాస్‌ను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.