Saturday, 7 November 2026

December 2012

జాతీయం

అత్యాచార బాధితురాలి ఆరోగ్యం విషమం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేయాల్సిన బులెటిన్‌ ఆసుపత్రి వర్గాలు ఇంకా విడుదల…

హైదరాబాద్

కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డ నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణపై అఖిలపక్ష సమావేశం సందర్భంగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తున్న తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి నారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలు కేంద్రంపై ఆధారపడటాన్ని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలు ఉత్సవవిగ్రహాలుగా ఉన్నారని ఆయన ఆరోపించారు.

అంతర్జాతీయం

శెట్టార్‌ సీఎం పదవినుంచి వైదొలగాలి: యడ్యూరప్ప

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి జగదీశ్‌శెట్టార్‌ ముఖ్యమంత్రి పదవినుంచి తప్పు కోవాలని మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక జనతా పక్ష నేత యడ్యూరప్ప డిమాండ్‌ చేశారు. కర్ణాటకలో భాజపా ప్రభుత్వం మైనార్టీలో ఉందని ఆయన అన్నారు. పాలక పక్షం మైనార్టీలో…

హైదరాబాద్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

హైదరాబాద్‌: శంషాబాద్‌ మండలం పాలమాకుల వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. కారు, మోటర్‌సైకిల్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

సీమాంధ్ర

మురుగు గుంతలో పసికందు మృతదేహాలు

అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రి ప్రాంగణంలోని మురుగు గుంతలో ఏడు పసికందు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఘనస్వాగతం

హైదరాబాద్‌: భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. బుధవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర పతికి గవర్నర్‌ నరసింహన్‌తోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు, నగర మేయర్‌ ఘనస్వాగతం పలికారు.

అంతర్జాతీయం

తెలుగుభాష పరిరక్షణకు కృషి చేసిన పీవీ రావు కన్నుమూత

అట్లాంటా : అమెరికాలో తెలుగు బోధనకు విశేషకృషి చేసిన డా, పెమ్మరాజు వేణుగోపాలరావు కన్నుమూశారు. అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా బోథనతో పాటు, తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఆయన ఎంతో  సేవ చేశారని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు.…

హైదరాబాద్

పార్టీలన్నీ తెలంగాణపై ఇకే అభిప్రాయం చెప్పాలి : తెలంగాణ రాజకీయ ఐకాస

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై ఈ నెల 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో పార్టీలన్నీ  ఒకే అభిప్రాయం చెప్పాలని తెలంగాణ రాజకీచ ఐకాస డిమాండ్‌ చేసింది. బుధవారం తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు హైదరాబాద్‌లో మాట్లాడుతూ తెలంగాణపై స్పష్టత ఇవ్వని…

హైదరాబాద్

మద్యం సిండికేట్‌ కేసు విచారణ వాయిదా

హైదరాబాద్‌ : మద్యం సిండికేట్‌ కేసు విచారణను హైకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. మద్యం సిండికేట్‌ కేసులో 840 మందిని నిందితులుగా పరిగణిస్తూ ఏసీబీ నివేదికలో పేర్కొంది. 45 కేసులు నమోదుకాగా వాటిలో ఐదు కేసుల్లో నిందితులకు…

సీమాంధ్ర

తూగో జిల్లాలో అగ్నిప్రమాదం : పది ఇళ్లు దగ్థం

తొండంగి : తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం జీఎంపేట గ్రామంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. గ్రామానికి చెందిన నేమాల సత్యనారాయణ ఇంటి నుంచి ఎగిసిపడిన అగ్నికీలలు సమీప ఇళ్లను చుట్టేశాయి, దాదాపు పది ఇళ్లు ఈ…