Tuesday, 3 November 2026

January 2013

హైదరాబాద్

జిల్లా ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతిభద్రతలపై అన్ని జిల్లాల ఎస్పీలతో డీజీపీ దినేష్‌రెడ్డి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్

అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై కేసు నమోదైంది : సీఎం

హైదరాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై కేసు నమోదైందని సీఎం తెలిపారు. అక్బరుద్దీన్‌ కేసు విషయంలో ప్రభుత్వం జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన…

జాతీయం

దేశాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక రంగానిది కీలకపాత్ర : ప్రధాని

కోల్‌కతా : దేశ అభివృద్థిలో శాస్త్ర, సాంకేతిక రంగానిదే కీలకపాత్ర అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. భారత వందో వైజ్ఞానిక సదస్సు ఈరోజు కోల్‌కతలో ప్రారంభమైందిజ దీనిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రధాని మాట్లాడుతూ ధనికులు,…

సీమాంధ్ర

ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తెలంగాణపై నిర్ణయం

విజయవాడ :  ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తెలంగాణపై నిర్ణయం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలో  ఈ నెల 7న నిర్వహించే ప్రాంతీయ సదస్సు ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో…

జాతీయం

ప్రజల పై ఔషధ ప్రయోగాలు దారుణం : సుప్రీంకోర్టు

ఢిల్లీ : ప్రజలపై నియంత్రణ లేని ఔషధ ప్రయోగాలు దారుణమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రజలపై ఔషధ ప్రయోగాలను అడ్డుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆగ్రహించింది. ఆరోగ్యశాఖ కార్యదర్శి పర్యవేక్షణలోనే ఔషధ ప్రయోగాలు జరపాలని అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు…

సీమాంధ్ర

సుధాకర్‌ రెడ్డితో మాకు శత్రుత్వుం లేదు : పరిటాల సునీత

అనంతపురం : కాంగ్రెస్‌ నాయకుడు సుధాకర్‌రెడ్డి కుటుంబంతో తమకు వ్యక్తిగతంగాను. పార్టీ పరంగానూ ఎలాంటి శత్రుత్వం లేదని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలియజేశారు. హత్య నిందితులను పట్టుకోలేని పోలీసులు తన కుమారుడి అరెస్టుకు తొందరెందుకు పడుతున్నారని సునీత ప్రశ్నించారు.…

హైదరాబాద్

పోలవరం పర్యావరణ అనుమతుల పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఫిబ్రవరి 14కి వాయిదా వేసింది. పర్యావరణ అనుమతులపై జాతీయ పర్యావరణ అప్పీలేట్‌ అధారిటీ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ…

సీమాంధ్ర

భార్య, బిడ్డపై హత్యాయత్నం

ఒంగోలు : ఆడపల్లి పుట్టిందనే అక్కసుతో ఓ కిరాతకుడు భార్య, బిడ్డపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పట్టణంలోని పాపకాలనీలో ఈరోజు చోటుచేసుకుంది. ఈ ఘటనలలో తల్లీకూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు…

కరీంనగర్

కరీంనగర్‌ జిల్లా విద్యార్థునుల ఆందోళన

కరీంనగర్‌ : పురుగుల అన్నం పెడుతున్నారని కాటారం ఎస్పీ బాలికల వసతి గృహం విద్యార్థునులు ఆందోళన చేస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి భోజనం చేయకుండా విద్యార్ధినులు నిరసన వ్యక్తం చేస్తున్న ఆధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్ధినులు ఉన్నతాధికారులపై…

హైదరాబాద్

ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శితో సీబీఐజేడీ భేటీ

హైదరాబాద్‌: ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావుతో సీబీఐ జేడీ లక్ష్మినారాయణ భేటీ అయ్యారు. ఈ సమావేశం సచివాలయంలోని డి బ్లాక్‌లో జరుగుతోంది.