Wednesday, 4 November 2026

January 2013

హైదరాబాద్

ప్రేమ వేధింపులకు విద్యార్థిని బలి

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ బుద్వేల్‌ ప్రేమ వేధింపులు భరించలేక ఇంటర్‌ విద్యార్ధిని మౌనిక ఆత్మహత్యకు పాల్పడింది. మౌనిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వెంకటేశ్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్

విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనపై సీపీఎం ధర్నా

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్తు భారాన్ని పెంచేందుకు ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ సీపీఎం ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా నగరంలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మనుె దహనం చేశారు. కిరణ్‌ అసమర్థ పాలనతో…

హైదరాబాద్

ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు : ఈటెల

హైదరాబాద్‌: విద్యుత్‌ కోతలతో తెలంగాణ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని తెరాస నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్‌ ఛార్జీ.ల పెంపు ప్రతిపాదనను విరమించుకోకపోతే…

హైదరాబాద్

జనవరి 17 నుంచి అంతర్జాతీయ వైద్య సదస్సు

హైదరాబాద్‌: నగరం మరో అంతర్జాతీయ వైద్య సదస్సుకు వేదిక కానుంది. 28వ ఆసియా పసిఫిక్‌ అకాడమీ ఆప్తమాలజీ సదస్సు  ఈ నెల 17 నుంచి 20 వరకు నగరంలో జరగనుంది. ఈ సదస్సు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ముఖ్య…

సీమాంధ్ర

హైదరాబాద్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి

ఘనంగా వీడ్కోలు పలికిన పార్టీ నాయకులు కోరుకొండ : రాజమండ్రి విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గోల్లప్రోలు నుంచి హెెలికాప్టర్‌ ద్వారా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని…

హైదరాబాద్

దేశీయ విత్తనాలను ప్రోత్సహించాలి : సుభాష్‌ పాలేకర్‌

హైదరాబాద్‌: దేశీయ విత్తనాలు లభించేలా రైతులను ప్రోత్సహిస్తే నాణ్యమైన రసాయ రహిత పంటలు పండించవచ్చని ప్రకృతి వ్యవసాయ విధాన ఉద్యమ స్థాపకుడు సుభాష్‌ పాలేకర్‌ సూచించారు. నగరంలోని రామకృష్ణమఠం రహదారిలో  పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ ఉద్యమ రాష్ట్ర…

జాతీయం

ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ఢిల్లీ : భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌ 131 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది. 36 పరుగులు చేసిన కెప్టెన్‌ ధోని ఉమర్‌ గుల్‌ బౌలింగ్‌లో అక్మల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

హైదరాబాద్

ప్యాకేజీలు వద్దు రాష్ట్రమే కావాలి : సారయ్య

హైదరాబాద్‌: ‘ ప్యాకేజీలు. పదవులు సీమాంధ్ర నేతలనే తీసుకోమనండి, మాకు మాత్రం ప్రత్యేక రాష్ట్రం కావాలి’ అని మంత్రి సారయ్య అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ అధికారుల, ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన…

జాతీయం

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ఢిల్లీ : భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో 111 పరుగుల వద్ద టీం ఇండియా రెండు వికెట్లు కోల్పోయింది. 31 పరుగులు చేసిన రైనా అజ్మల్‌ బౌలింగ్‌ ఎల్బీగా వెనుదిరగగా, అశ్విన్‌ డకౌట్‌ అయ్యాడు.

జాతీయం

నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ఢిల్లీ : భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో 63 పరుగుల వద్ద టీం ఇండియా నాలుగొ వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన యువరాజ్‌సింగ్‌ను పాక్‌ బౌలర్‌ హఫీజ్‌ పెవిలియన్‌కు పంపాడు.