Tuesday, 3 November 2026

2020లో నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి గ్రామ సేవకుల సమ్మె నోటీసు

జులై13(జనంసాక్షి)
నారాయణఖేడ్  గ్రామ సేవకులకు 2020లో ప్రకటించిన నూతన రెవెన్యూ చట్టం ప్రకారము ప్రభుత్వం ఇచ్చిన హామీని పే స్కేల్ ప్రమోషన్ వారసత్వ  ఉద్యోగాలు అమలు చేయాలని డిమాండ్తో గ్రామ సేవకుల సంఘం తరఫున నారాయణఖేడ్ తాసిల్దార్ కు సమ్మె నోటీస్ అందించారు. గ్రామ సేవలకు ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీలను అమలు చేయకపోవడంతో రాష్ట్ర జేఏసీ కమిటీ పిలుపు మేరకు ఈనెల 20 21 22 చలో కలెక్టరెట్  రిలే నిరాహార దీక్షలు చేపడతామని సమ్మె నోటీసులు వారు పేర్కొన్నారు. గ్రామ సేవకులు ఇచ్చిన మూడు రోజుల టైం లో ప్రభుత్వం గ్రామ సేవకులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే ఈనెల 25వ తేదీన నిరాహార దీక్ష ను నిలిపివేస్తామని లేనిపక్షంలో 25వ తేదీ నుండి నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని నారాయణఖేడ్ మండల గ్రామ సేవకుల సంఘం హెచ్చరించింది. అదేవిధంగా గ్రామ సేవకులతో మారుమూల గ్రామాల్లో అనేక పనులు ప్రభుత్వ అధికారులు గ్రామ పెద్దలు చేయించుకుంటూ వారి సమస్యలను పట్టించుకోవడంలేదని వారు అందులో పేర్కొన్నారు. పల్లె గ్రామాల్లో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో కుటుంబాల లకు గొడవలు జరుగుతూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం దాడులకు పాల్పడడం చేసుకుంటున్నారని ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చోరువ తీసుకొని వారసత్ ఉద్యోగానికి గ్రామ సేవలకు ఇప్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపించాలని వారి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా 2020లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు నారాయణఖేడ్లో గ్రామ సేవకుల సంఘం తరఫున సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు ఈ సమ్మె నోటీసు ఇచ్చిన వారిలో గ్రామ సేవకుల సంఘం నారాయణఖేడ్ మండల అధ్యక్షులు.
Attachments area