Thursday, 5 November 2026

21 న జరిగె బోనాలకు విద్యాశాఖమాత్యులుసబితాఇంద్రారెడ్డి ఆహ్వానం

   రోడ్డు మరమ తులు చేయాలని  తెలంగాణ విద్యా శాఖ మాత్యులు   సబితా ఇంద్రారెడ్డి  కి వినతి పత్రం

 ఎల్బీనగర్ (జనం సాక్షి )  బాలాపూర్ తెరాస నాయకులు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మాత్యులు సబితాఇంద్రారెడ్డి, ని కలిసి గురువారం అనగా 21 న జరిగే బోనాలకు ఆహ్వానిoచడం జరిగింది.   అదే విందంగా  ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేష్ అత్యంత వైభవంగ జరిగే లడ్డు వేలం పాట,  వినాయక సాగర్లో నిమర్జనం చేయడానికి  వెళ్లే దారి బాలాపూర్ నుండి చంద్రాయన్ గుట్ట  రోడ్ వరకు రోడ్ మరమ్మతులు  , గుర్రం చేరువు కట్ట మీద జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణాని  త్వరలో పూర్తి చేయాలనీ కోరుతూ అనగా   బాలాపూర్ గణనాథుని తీసుకవచ్చే దారి ఇక్కడి నుండే గనక పండగ కంటే ముందే పూర్తి చేయాలనీ కోరుతూ అదే విదంగా శివాజీ చౌక్ నుండి బాలాపూర్ వినాయక మండపం వరకు  రోడ్ మరమ తులు చేయగలరని తెలంగాణ విద్యా శాఖ మాత్యులు   సబితా ఇంద్రారెడ్డి  కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. . ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి ,కళ్లెం ఎల్లారెడ్డి , బడంగ్పేట్ కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యులు రఘునందన్ చారి , బడంగ్పేట్ మున్సిపల్ ఉపాధ్యక్షులు తిమ్మని గిరీష్ గారు, అత్తాపురం శ్రీనివాస్ రెడ్డి గారు, జూకంటి సురేష్ గౌడ్ గారు, కొప్పుల రాజు గారు, కందికంటి అరవింద్ గౌడ్, విజయ్, శివ తదితరులు పాల్గొన్నవారు.