Wednesday, 4 November 2026

అంతారం పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

మునిపల్లి(జనంసాక్షి, మార్చ్ 04): మండలంలోని అంతారం గ్రామంలో విద్యార్థులు ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు శనివారం నాడు ఒక్కరోజు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంతారంలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు.  ఇందులో భాగంగానే ప్రధానోపాధ్యాయునిగా దుర్గాప్రసాద్, డీఈవోగా నౌశీన్,  టీచర్స్ గా స్పందన, శైలజ, ఆజాం, సురేష్, గీతలు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు సయ్యద్ సాబెర్ అలీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఉండాలని చెప్పారు. అంతకు ముందు విద్యార్థులు తోటి విద్యార్థులకు విద్యాబుద్ధులు నిర్వహించడంతో వారిని అభినందించి బహుమతులు అందజేశారు.