– యూని ఎక్స్ పర్ట్స్
ఖైరతాబాద్ ; జులై 21 (జనం సాక్షి)
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో ఉన్నత విద్యను అభ్యసించాలనే విద్యార్థుల కోసం ఈ నెల 23న యూని ఎక్స్ పర్ట్స్ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని తమ సంస్థ కార్యాలయంలో యూ ఎస్ ఏ అడ్మిషన్ డే ను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ తెలంగాణ ఆపరేషన్స్ హెడ్ ఉమా తెలిపారు. ఈ మేరకు సోమాజిగూడా లోని తమ సంస్థ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మార్కెటింగ్ మేనేజర్ పవన్ తో కలిసి ఆమె మాట్లాడారు.ఈ అడ్మిషన్స్ డే లో విద్యార్థులు, తమ తల్లిదండ్రులు నేరుగా పాల్గొని అప్లికేషన్స్, వీసా రిక్రూట్మెంట్స్, స్కాలర్షిప్ ఆప్షన్స్, తదితర అంశాలపై నేరుగా యూనివర్సిటీలతో సంప్రదింపులు జరగవచ్చునని తెలిపారు. ఈ యూనివర్సిటీ లలో విద్యను అభ్యసించేవారు 2 వేల డాలర్స్ నుంచి 10 వేల డాలర్ల వరకు స్కాలర్షిప్లు తో పాటు 5 సంవత్సరాల వీసా పొందుతారని తెలిపారు. ఈ అడ్మిషన్స్ డే లో యూ ఎస్ ఏ కు చెందిన 13 పైగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ పాల్గొంటున్నాయని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9912328645 నెంబర్ ను సంప్రదించవలసినదిగా కోరారు.
Attachments area




