మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన

కొట్టి ప్రవీణ్ కుమార్

టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 2 మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా టేక్మాల్ మండలం తంప్లూర్ గ్రామానికి చెందిన కొట్టి ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు. జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి , జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి చేతుల మీదుగా నియమాక పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు ప్రవీన్ కుమార్ ని అభినందించి శాలువాతో సన్మాంచారు. కొట్టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ. నియామకానికి సహకరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి సిడబ్ల్యుసి శాశ్వత సభ్యులు దామోదర్ రాజనరసింహ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ రాథోడ్ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు ఉదయ్ కుమార్,జిల్లా యన్ యస్ యూ ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ రెడ్డి, యన్ యస్ యూ ఐ మెదక్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తుకారం గౌడ్,కొండ నాగయ్య , ఖలీల్,సంగమేష్, వసీమ్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు