హెల్త్ సెంటర్ల నిర్మాణ పనులను పరిశీలించిన

అదనపు కలెక్టర్ జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో, అలాగే కమాన్ పూర్ మండలం జూలపల్లి, పేరపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న హెల్త్ సెంటర్ల నిర్మాణ పనులను శనివారం అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ పరిశీలించారు. 15 రోజుల్లో పెండింగ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని పూర్తి చెయ్యాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్త్యాల గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య, డీ ఎమ్ హెచ్ వో ప్రమోద్ కుమార్ ఏఈ అనిల్ కుమార్, కార్యదర్శి పర్శరాం, హెల్త్ సెంటర్ సిబ్బంది లత, స్వరూప పాల్గొన్నారు.

తాజావార్తలు