భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్ 2

గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని రాజా శ్రీనివాస్ నగర్,న్యూ మధుసూదన్ నగర్ ఏరియాలలో  8 లక్షలతో భూగర్భ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే మదనపల్లి హనుమంతరావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్,  జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ కుమార్,మేనేజర్ నవీన్ కుమార్, మేకల రామూయాదవ్,నాయకులు కార్యకర్తలు,కాలని వాసులు  తదితరులు పాల్గొన్నారు.
అనంతరం కార్పొరేటర్ కుమారుడు ప్రణవ్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా కార్పొరేటర్ కార్యాలయంలో ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు కార్పొరేటర్ మేకల సునీత రాముయాదవ్ తో కలిసి ప్రణవ్ తో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం రాఘవేంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.

తాజావార్తలు