నూతన కమిటీని ఎన్నుకున్న తెలంగాణ గిరిజన సంఘం

— అధ్యక్షులుగా బానోత్ వెంకన్న

— కార్యదర్శిగా ఆంగోత్ వెంకన్న

మహబూబాబాద్, టౌన్( సెప్టెంబర్ 5) జనం సాక్షి న్యూస్ :

మహబూబాబాద్ జిల్లా తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్షులుగా బానోత్ వెంకన్న,
కార్యదర్శిగా ఆంగోత్ వెంకన్నను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంజరిగింది. అనంతరం అధ్యక్ష, కార్యదర్శుల ఆధ్వర్యంలో జిల్లా కమిటీ కొరకు 19 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులుగా బానోత్ వెంకన్న, కార్యదర్శిగా ఆంగోత్ వెంకన్న ఉమ్మడిగా మాట్లాడుతూమహబూబాబాద్ జిల్లాలోని అన్ని గిరిజన తెగలను ఏకం చేసి రాబోయే రోజులలో గిరిజన హక్కుల కోసం పని చేస్తామని తెలుపుతూ, ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాలో ఐ టి డి ఐ ఏర్పాటు కోసం కృషి చేస్తామని, గిరిజన మౌలిక సమస్యల పరిష్కార కోసం నిరంతరం కృషి చేస్తామని, ఈ ప్రాంతంలో బయ్యారం ఉక్కు పరిశ్రమల ఏర్పాటు కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలుపుతూ, గిరిజన విద్యార్థులను ఏకం చేసి మహబూబాబాద్ జిల్లాలో తండాలను అన్ని విధాల సమస్యల పరిష్కారమైయే విధముగా ముందుకు వెళ్తామని అన్నారు. మా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామ్ నాయక్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.

తాజావార్తలు