కరెంట్ షాక్ తో దాడిగాల జ్యోతి మృతి
మహబూబాబాద్, టౌన్ ( సెప్టెంబర్ 5 ) జనం సాక్షి న్యూస్ :మహబూబాబాద్ మున్సిపాలిటీ 16వ వార్దుకు చెందిన దాడిగాల జ్యోతి (38) సంవత్సరముల వయస్సు, కులం మంగలి, ఆమెకు ఇద్దరు కుమార్తెలు , కూలి పని తో జీవనం కొనసాగిస్తూ, మహబూబాబాద్ పట్టణంలోని గిరిప్రసాద్ నగర్ కాలనీలో నివసిస్తూ, దినచర్యలో భాగంగా తన ఇంటి ముందు జే వైర్ మీద బట్టలు అరవేయడానికి, వెళ్లి, జై వైరును ముట్టుకోగా 4/9/2023 రోజు రాత్రి సుమారుగా 9 గంటల 30 నిమిషములకు కరెంట్ షాక్ తో జ్యోతి (38) మరణించడం జరిగింది. విద్యుత్ షాక్ తో ఇంట్లోని బట్టలు, సర్టిఫికెట్స్,తో పాటు ఉన్న అన్ని వస్తువులు కాలిపోయినవి. విద్యుత్ షాక్ తో మరణించిన మహిళ జ్యోతి(38)కి ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తెకు వివాహం చేయడం జరిగింది. చిన్న కుమార్తె పూజిత డిగ్రీ చదువుతూ తన తల్లి జ్యోతి తోనే ఉండేది, అమ్మ చని పోవడంతో, ఉన్న ఇల్లు విద్యుత్ షాక్ తో కాలిపోవడంతో, చిన్న కుమార్తె పూజిత డిగ్రీ వరకు చదువుతున్న సర్టిఫికెట్స్ కాలి పోవడంతో పాటు, వంటరీ అనాధ గా మిగిలిపోవడంతో స్థానిక ప్రజలు, ప్రభుత్వం ఆ యొక్క కుటుంబానికి తగు న్యాయం చేసి ఆదుకోవాలనికోరడం జరిగింది.