రోడ్డుపై నుంచి వెళ్తున్న వర్షం నీరు

ప్రతిసారి ఇదే తంతు.

– పట్టించుకోని ప్రజాప్రతినిధులు.

-అయోమయంలో ప్రయాణికులు.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 6, జనం సాక్షి.వర్షాకాలం వస్తుందంటేనే సిద్దిపేట వెళ్లే ప్రయాణికులకు గుండెల్లో గుబులు పుట్టాల్సిందే గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి మండల పరిధిలోని లింగరాజు పల్లి, సూరంపల్లి, ముత్యంపేట, దొమ్మాట, గాజులపల్లి, మిరుదొడ్డి, తొగుట మండలాల ప్రజలు ప్రతిరోజు దౌల్తాబాద్ పట్టణానికి వచ్చి పోయే రైతులకు, ప్రభుత్వ ప్రైవేటు శాఖలలో విధులు నిర్వహిస్తున్న ప్రయాణికులకు రు ప్రతిసారి దొమ్మాట వాగు రోడ్డుపై నుంచి వర్షపు నీరు వెళుతుంటే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో పలుసార్లు ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్న ఫలితం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరమైనా వంతెనను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరారు.

తాజావార్తలు