ముంజంపల్లిలో అమృత వాటికకు మట్టి సేకరణ
భాజపా ఆధ్వర్యంలో నా మట్టి-నా దేశం
మానకొండూరు, ఆర్ సి, సెప్టెంబర్ 6 ( జనం సాక్షి):మానకొండూర్ మండలంలోని ముంజంపల్లి గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు బుధవారం మండల భాజపా నాయకులు నా మట్టి- నా దేశం కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా ముంజంపల్లి శక్తికేంద్ర ఇంచార్జీ మొగిలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో తరలి వెళ్లి ఇంటింటా మట్టిని సేకరించారు. అనంతరం హనుమాన్ దేవాలయంలో మట్టి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి నియోజవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు లు హాజరై మాట్లాడుతూ.. ప్రపంచంలో మట్టిని తల్లిగా, దైవంగా పూజించే ఏకైక దేశం భారతదేశం అని దేశ ఔన్నత్యాన్ని కొనియాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ అమృతోత్సవాలలో భాగంగా భారత స్వాతంత్ర సమరయోధులకు, అమర జవాన్ల స్మారకంగా ఢిల్లీలోఅమృత వాటికను నిర్మిస్తున్నారని , అమృత వాటికకు ప్రతి గ్రామం నుండి మట్టిని సేకరిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు సిరిసిల్ల చంద్రయ్య, మండల ప్రధాన కార్యదర్శి సోన్నాకుల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు శీలం కుమార్ యాదవ్, మండల కార్యదర్శి చొప్పరి అశోక్,ఓబీసీ మోర్చ మండల అధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్, బల్ల అంజి, ముంజంపల్లి బూత్ అధ్యక్షులు పిట్టల నరేష్, కుమార్, పిట్టల అనిల్, అజయ్, సురేష్, సంపత్, మహిళలు పాల్గొన్నారు.