ఆజాత శత్రువు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి టికెట్ కేటాయించాలి..

ఎండి సాజిద్ ఖాన్, జనం సాక్షి / కొల్చారం ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాయంలోని నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని తిరిగి మూడోసారి కూడా మదన్ రెడ్డికే టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వాలని మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామం ప్రజలు బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. వరిగుంతం గ్రామంలో నేడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన నాయకుడు తిరుమల మదన్ రెడ్డి అని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. ప్రజలే తన పిల్లలుగా నియోజకవర్గమే తన ఇల్లుగా భావించి సినిమాల మదన్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి చేశారని ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పాలన సాగించారని వారు తెలిపారు తిరిగి మూడోసారి ఆయనకే అవకాశం ఇస్తే అధిక మెజార్టీతో గెలిపిస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బ్యాగరి ప్రేమయ్య, మొగులా గౌడ్, శ్రీనివాస్, రాజు, సిద్ధప్ప, కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు