ప్రశాంతమైన వాతావరణంలో వినాయక ఉత్సవాలు జరుపుకోవాలి.

వినాయక మంటపాల నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి.
నిబంధనలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు.
డీఎస్పీ శేఖర్ గౌడ్.
తాండూరు సెప్టెంబర్ 13(జనంసాక్షి) ప్రశాంతమైన వాతావరణంలో వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని
డీఎస్పీ శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం తాండూరు పట్టణం ఆర్యవైశ్య కళ్యాణమం డపంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి నిర్వహణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎస్పి శేఖర్ గౌడ్ హాజరై మాట్లాడుతూ ఎవరైనా ఎక్కడైనా వినాయక మండపాలు ఏర్పాటు చేసినప్పుడు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని అన్నారు. వినాయక మండపం నిర్వాహకులు ముందస్తుగా ఆన్లైన్ లో మండపం నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకుని అందుకు సంబంధించిన పత్రాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో అందజేయాలని అన్నారు. మండపం నిర్వాహకులు తప్పనిసరిగా విద్యుత్ అధికారుల అనుమతి తీసుకోవాలని.. అదే విధంగా ప్రజలకు ఇబ్బంది కలిగే ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేయడం మంచిది కాదని అన్నారు. అదేవిధంగా నిమజ్జన సమయంలో డీజె సౌండ్ పెట్టడానికి నిబంధనల ప్రకారం ఎటువంటి అనుమతులు లేవన్నారు. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా మండపాల వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండప నిర్వాహణ కమిటీలో ముఖ్య సభ్యుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లు విధిగా పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. వినాయక చవితి పండుగను అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నరసింహులు, పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి, వివిధ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు