డాక్టర్ సంపత్ కుమార్ కు తాండూరు కాంగ్రెస్ టిక్కెట్‌..?

సంపత్ కుమార్ పోటీ పై నియోజకవర్గంలో జోరుగా చర్చ.
90శాతం తాండూరు కాంగ్రెస్ టీకేట్ సంపత్ కే.
జనం సాక్షి తాండూరు మొదటి సర్వేలో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు..
వచ్చే ఎన్నికల్లో స్థానికులకే పట్టం కట్టబోతున్న ప్రజలు.
తాండూరు సెప్టెంబర్ 13 జనం సాక్షి) తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సంపత్ కుమార్ కు 90శాతం వరకు టికెట్ కన్ఫర్మ్ అయినట్లు నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు. అయితే మహిళా రిజర్వేషన్ కల్పిస్తే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్ కు అవకాశాలు లభిస్తున్నట్లు
చర్చ జరుగుతుంది.ఇప్పటికే తాండూరు అభ్యర్థిగా కేఎల్‌ఆర్‌ను కన్ఫాఫ్ చేసినట్లు తాండూరులో జోరుగా చర్చ కోనసాగుతుంది. ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు స్థానం నుంచి దాదాపు 10 మందికి పైగా దరఖాస్తులు సమర్పించుకున్నారు. మేడ్చేల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్ఆర్‌), టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్‌ మహరాజ్, ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మరో ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి, వికారాబాద్‌కు చెందిన సుధాకర్ రెడ్డి, స్పోక్ పర్సన్ కల్వ సుజాత, మాజీ సర్పంచ్ ఉత్తమ్ చంద్, జనార్దన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉమేర్ అబ్దుల్లా, ప్రముఖ వ్యాపారి శ్రీరాంరెడ్డిలు దరఖాస్తులు సమర్పించారు. ఇందులో అధిష్టానం డాక్టర్ సంపత్ కుమార్ దంపతులకు ఈ సారి టిక్కెట్‌ కన్ఫామ్ అయినట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. తాండూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సర్వేలో కూడా డాక్టర్ సంపత్ కుమార్ కు పూర్తి మద్దతు ఉన్నట్లు స్పష్టం అవుతుంది.
బి వి జి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనసును దోచుకుంటున్నారు. ఇటువైద్య రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ ఆరితేరిన వ్యక్తిగా డాక్టర్ సంపత్ కుమార్ కు గుర్తింపు లభిస్తుంది.
ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తి డాక్టర్ సంపత్ కుమార్ అని ప్రజలు అంటున్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సమాధానం ఇస్తారని ఇలాంటి వ్యక్తులే తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నారు. అందులోను స్థానికులుగా ఉంటారని ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారని ఈసారి డాక్టర్ సంపత్ కుమార్ కే ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే జనం సాక్షి మొదటి సర్వేలో తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అధికంగా ఆదరణ లభిస్తుంది. అయితే తాండూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఎవరు ఉంటారు అనేది మరికొన్ని రోజులు వేచి చూద్దాం

తాజావార్తలు