ఎస్సై నుండి సిఐ నుండి డిఎస్పీ గా ప్రమోషన్ పొందిన సి హరిచంద్రారెడ్డి కిఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.

కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 13 మండల పరిధిలోని రాజాపురం గ్రామానికి చెందిన చీమార్ల హరిచంద్రారెడ్డి ఎస్సై,నుండి సిఐ గా ప్రమోషన్ పొంది,ప్రస్తుతం సైబరాబాద్ డిఎస్పీ గా ప్రమోషన్ పొంది, బాల్యంలో చదివిన సొంత గ్రామానికి వచ్చిన సందర్భంగా విద్యార్థులు కోలాటాలు గిరిజన నృత్యాల తో హరిచంద్రారెడ్డి కి మనంగా స్వాగతం పలుకుతూ డిఎస్పీని సన్మానించారు.అదేవిధంగా ఆయన బాల్య మిత్రులు క్లాస్ మెంట్స్ మరియు హరిచంద్రారెడ్డి ని చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు వి రాంరెడ్డి, శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ హరిచంద్రారెడ్డి, చిన్నపాటి స్నేహితులు, గోవర్ధన్ రెడ్డి టీచర్, సి నాగశేషు,యం బాల నాగయ్య టీచర్,సి నాగరాజు హెడ్కానిస్టేబుల్, యం నర్సింహా కానిస్టేబుల్, టీచర్ రాకేష్, జెడ్పీ ఎచ్ ఎస్ ఎచ్ ఎం భాస్కర్ శర్మ, స్కూల్ చైర్మన్ బి శివ, వార్డు మెంబర్ బి లక్ష్మయ్య, గ్రామ యువకులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు తదీతరులు, పాల్గొన్నారు.

 

తాజావార్తలు