మెగా జాబ్ ఫెయిర్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర నాయకులు సాధం సంపత్ కుమార్ , బాబురావు నాయక్
తిరుమలగిరి(సాగర్) సెప్టెంబరు 13, (జనంసాక్షి ):తిరుమలగిరి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన హాలియాలోని లక్ష్మీ నరసింహ గార్డెన్ లో జరిగే టాస్క్ వారిచే ఏర్పాటుచేసిన మెగా జాబ్ ఫెయిర్ వాల్ పోస్టర్ ని రాష్ట్ర నాయకులు సాదం సంపత్ కుమార్, బాబురావు నాయక్ లు కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు పిడిగం నాగయ్య, మండల ప్రధాన కార్యదర్శి పోతుగంటి తిరుమల్ ,సాగర్ పట్టణ యూత్ అధ్యక్షులు ఆవుల దొడ్డి రాహుల్ యాదవ్, శ్రీరాంపల్లి సర్పంచ్ ఇస్రం నగేష్ ,చేగొండి కృష్ణ యాదవ్, పంగ లక్ష్మణ్ యాదవ్,,పేరూరు దేవస్థానం చైర్మన్ రామలింగయ్య యాదవ్,తిరుమలగిరి సోషల్ మీడియా అధ్యక్షులు ఇరిగి గోపి, వనమాలు,పల్లె నరేష్, మేరవత్ హతిరాం నాయక్, మేరావత్ రతన్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు