ప్రతి  అమావాస్య ముందుబోయినపల్లి మార్కెట్ యాడ్ లో నరకయాతనే

-ట్రాఫిక్ క్లియర్ చేసిన ఉన్నత శ్రేణి అధికారి ఎం.వెంకన్న

సికింద్రాబాద్ ఆర్.సి జనం సాక్షి సెప్టెంబర్ 13 బోయినపల్లి లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కూరగాయల మార్కెట్ యార్డు కు ప్రతి రోజూ వేల మంది తో నిత్యo కూరగాయల వ్యాపారం సాగుతుంది. ఇదిలా ఉంటే నెలకు ఒకసారి వచ్చే అమావాస్య ముందు రోజు దాదాపు ముప్పై వేల టన్నుల పై సరుకుమార్కెట్ యార్డుకి దిగుమతి అవుతుంది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వివిధ రకాల కూరగాయలు బోయిన్ పల్లి మార్కెట్ యార్డు కు నిత్యo చేరుతాయి.నిన్న డబుల్ మార్కెట్ యార్డు లో ట్రాఫిక్ జామ్ తో అస్తవ్యస్తంగా మారిపోయింది.వెంటనే యుద్ధప్రాతి పదికన ఉన్నత శ్రేణి అధికారి ఎం.వెంకన్న తనదైన శైలిలో ఫీల్డ్ లో దిగి అష్టాదిగ బంధంలో ఉన్న వాహనాలను క్లియర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.కమిషన్ ఏజెంట్లు డిమాండ్ ను బట్టి సరుకును రైతు నుంచి తెప్పించుకున్ని జంట నగరాల్లో నివసించే ప్రజలు కు సుమారు నలబై లక్షల నుంది కి ఈ మార్కెట్ యార్డు నుంచి వివిధ ప్రాంతాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తారు.ఈ బాధ్యతలు చేపట్టిన ఉన్నత శ్రేణి అధికారి ఎం.వెంకన్న పది రోజులలోనే ఆయన స్టామినా ఏంటో మార్కెట్ కి చూపించారు.స్థానిక ప్రజలు కమిషన ఏజెంట్లు ఆశ్చర్యపోవటం వారి వంతయింది, ఇలాంటి అధికారి ఉంటే మార్కెట్ కు మంచి రోజులు వస్తాయని పలువురు సంతోషాన్ని వ్యక్తపరిచారు

తాజావార్తలు