ప్రశ్నించిన ఆదివాసి సర్పంచ్ పై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్న ఐటీడీఏ డిడి పోచంను సస్పెండ్ చేయాలి-తుడుం దెబ్బ ములుగు జిల్లా అధ్యక్షులు పులిశే బాలకృష్ణ
ఏటూరు నాగారం ( జనం సాక్షి) సెప్టెంబర్,14ఏటూరు నాగారం మండల కేంద్రంలో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ,ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు పులిసే బాలకృష్ణ మాట్లాడారు. ఐటీడీఏ ఏటూరు నాగారం పరిధిలోగల గిరిజన విద్య పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోకుండా వాటిని చెత్తబుట్టలో వేసి గిరిజన విద్య పట్ల పూర్తి అలసత్వం వహిస్తూ విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్న డిడి గారిని ప్రశ్నిస్తే డిడి గారు ప్రశ్నించిన సర్పంచ్ కొరశ నరసింహమూర్తి పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి భయభ్రాంతులకు గురి చేయడం విచారకరంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. డిడి గారు గిరిజన సంక్షేమ శాఖలో ఒక ఉన్నత పోస్టులో ఉండి గిరిజన సమస్యలు పరిష్కరించాల్సింది పోయి తిరిగి వారి మీదనే కేసులు పెట్టడం ఆయన పనితీరు ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారని తెలియజేశారు. సోమవారం అనగా 11 /0 9 /2023 నాడు గిరిజన దర్బార్ కు తన గ్రామపంచాయతీలో ఆయన బర్లగూడెం లోని చిరుతపల్లి పాఠశాలకు ఒక ఉపాధ్యాయుని నియమించాలని గత ఆరు నెలలుగా పిఓ గారికి వినతి పత్రాలు ఇస్తూ మొరపెట్టుకుంటే దానిమీద పరిష్కారం చూపాల్సింది పోయి డిడి గారు పట్టించుకోకపోవడం లేదని నిలదీసిన పుణ్యాన వెంకటాపురం మండలంలోని బర్లగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ నరసింహమూర్తి (ఆదివాసి నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు) గారిపై ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్లో డిడి గారు ఫిర్యాదు చేసి వేధింపులకు పాల్పడుతున్నాడని ఇలాంటి అధికారి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని వాపోయారు .
డిడి గారు గతంలో కూడా ఇక్కడ పని చేసి సస్పెండ్ అయ్యారు తిరిగి మళ్ళీ ఇదే ఐటీడీఏ ఏటూరు నాగారంకు వచ్చిన ఆయన పద్ధతిలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన అన్నారు. ఇతని వల్ల గిరిజన విద్య కుంటుపడుతుందని, చిరుతపల్లి విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఆందోళన వెలిబుచ్చారని ఆయన తెలిపారు. తక్షణమే కలెక్టర్ గారి స్పందించి ఆదివాసి సర్పంచ్ కోర్స నరసింహమూర్తి ని పోలీసుల చేత వేధిస్తున్న డిడి గారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఐక్య ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఐటీడీఏ ఏటూరు నాగారంను ముట్టడించి హక్కులను సాధించుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.