అత్యంత మహిమాన్వితురాలుకట్ట మైసమ్మ తల్లి.
ఆలయంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు. అమావాస్యను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్.తాండూరు సెప్టెంబర్ 14 జనం సాక్షి అత్యంత మైమాన్వితురాలు కట్టమైసమ్మ తల్లి అని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ అన్నారు. గురువారం తాండూరు పట్టణం ఆదర్శనగర్ లో కొలువు వైన శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు విట్టల్ నాయక్ కమిటీ సభ్యులతో కలిసి ఆలయంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులను ఉద్దేశించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విటల్ నాయక్ మాట్లాడుతూ గత తొమ్మిది నెలలుగా ప్రతి అమావాస్యను పురస్కరించుకొని అమ్మవారి ఆలయ సన్నిధిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న
అల్లంపల్లి ప్రకాష్ కుమ్మరి నర్సింలు లను ఆయన అభినందించారు.అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజలపై నిరంతరం ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో ప్రతినెల అమావాస్య రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమాని కి దాతలు ముందుకు వచ్చి అన్నదానం చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లంపల్లి ప్రకాష్ కుమ్మరి నర్సింలు న్యాయవాది దిలీప్ సింగ్ ఠాకూర్,మహేష్,ఆలయ పూజారి చందు స్వామి
తదితరులు పాల్గొన్నారు.