అంగన్వాడి ఉద్యోగులపై వేధింపులు ఆపాలని సిడిపిఓ ఆఫీస్ ముట్టడి

జనంసాక్షి, మంథని : తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ జేఏసీ పిలుపు మేరకు సమ్మెలో పాల్గొంటున్న మంథని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసు ముట్టడి జరిగింది.ఈ సందర్భంగా బూడిద గణేష్ జి. జ్యోతి మాట్లాడుతూ..చట్టబద్ధంగా సమ్మె చేస్తున్న అంగన్వాడి ఉద్యోగులపై సమ్మె విరమించాలని అధికారులు అంగన్వాడి టీచర్లకు ఫోన్లు చేసి వేధిస్తున్నారని ఇతర డిపార్ట్మెంట్ల ఉద్యోగులతో సెంటర్ల తాళాలు పగలగొట్టారు. నాలుగు రోజులు గడిచినప్పటికీ ఈ వేధింపులు ఆగడం లేదన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా గర్భిణీ బాలింతలకు పసిపిల్లలకు ఎటువంటి ఆటంకం లేకుండా అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. గత్యంతరం లేకనే అంగన్వాడి ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్లడం జరిగిందన్నారు . ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వాన్ని చర్చలకు పిలిచి కనీస వేతనం 26 వేల రూపాయలు పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు అత్యుత్సాహం చెబితే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సందీప్ అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బీ వనజారాణి, కే శోభ, వై సుగుణ , సిహెచ్ హరిత ,టి కృష్ణ కుమారి, స్వరూప ,సులోచన కొండమ్మ అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.

తాజావార్తలు