Tuesday, 3 November 2026

మహిళా మోర్చా ఆధ్వర్యంలో నరేంద్రమోడీకి పాలాభిషేకం

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 20 (జనంసాక్షి) మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు ఎట్లా అనిత సత్తిరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం మహిళలకు చట్ట సభల్లో 33% శాతం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూ ప్రధాన రహదారిపై ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తడిసిన మల్లారెడ్డి జిల్లా మహిళ మోర్చా కార్యదర్శి గుర్రం చేతన్య మరుపాక వరమ్మ బోయిని మమత పిట్టల సత్తెమ్మ పిట్టల విజయలక్ష్మి రజిత భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తలు మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు